1. ఎంజీ మోటార్ నుంచి రెండు డోర్లు గల స్మార్ట్ అర్బన్ ఎలక్ట్రిక్ సిటీ కార్ త్వరలో రాబోతోంది. ఎంజీ మోటార్ ఇండియా నుంచి రిలీజ్ కాబోతున్న రెండో ఎలక్ట్రిక్ వెహికిల్ ఇది. ఈ కార్కు కామెట్ (Comet) అని పేరు పెట్టారు. ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా మాక్‌రాబర్ట్‌సన్ ఎయిర్ రేస్‌లో పాల్గొన్న 1934 నాటి బ్రిటిష్ విమానం నుంచి ప్రేరణ పొంది కామెట్ ఈవీ అని పేరు పెట్టారు. (image: MG Motor India)
2. ఎంజీ కామెట్ ఈవీ విశేషాలు చూస్తే కేవలం రెండు డోర్లు ఉన్న ఈ కార్లో నాలుగు సీట్లు ఉంటాయి. నలుగురు కూర్చోవచ్చు. ఇందులో 25-kWh బ్యాటరీ ప్యాక్, 50 kW మోటార్ ఉంటుంది. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 150 కిలోమీటర్ల నుంచి 200 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. వులింగ్ ఎయిర్ ఈవీ తరహాలోనే ఎంజీ కామెట్ ఈవీ పెర్ఫామెన్స్ ఉంటుంది. ఇందులో లిథియం ఐరన్ ఫాస్ఫేట్ సెల్స్‌తో బ్యాటరీ ఉంటుంది. (image: MG Motor India)
3. తేలికైన డిజైన్, సుదీర్ఘ జీవిత కాలం, పెద్దగా మెయింటనెన్స్ లేకపోవడం, ఛార్జింగ్ సామర్థ్యం ఎక్కువగా ఉండటం ఈ బ్యాటరీ ప్రత్యేకత. ఇక కారు లోపల ప్రీమియం ఫీచర్స్ ఉంటాయని తెలుస్తోంది. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఇన్ఫోటైన్మెంట్ సెంటర్ కోసం డ్యూయెల్ 10.25-అంగుళాల డిజిటల్ డిస్ప్లే, కనెక్టెడ్ ఫీచర్స్ ఉంటాయి. (image: MG Motor India)
4. ఈ ఫీచర్స్ అన్నీ కలిపి ఎంజీ కామెట్ స్మార్ట్ అర్బన్ ఈవీగా మారుస్తాయి. ఈవీ మొబిలిటీ విభాగంలో ట్రెండ్‌సెట్టర్‌గా మారుతుంది. మొత్తంగా సరికొత్త ఈవీ సెగ్మెంట్‌ను సృష్టిస్తుందని కంపెనీ అంచనా వేస్తోంది. రద్దీగా ఉండే పట్టణ నగరాల్లో డ్రైవింగ్‌ను సులభతరం చేస్తుందని, తక్కువ పార్కింగ్ స్థలాన్ని ఆక్రమిస్తుందని కంపెనీ చెబుతోంది. (image: MG Motor India)
5. ఎంజీ కామెట్ ఈవీ ధర ఎంత ఉంటుందన్నదానిపై చర్చ జరుగుతోంది. టాటా నానో కార్‌ను తలపిస్తున్న ఎంజీ కామెట్ ఈవీ ధర రూ.10 లక్షల లోపే ఉండొచ్చని అంచనా. ఈ కార్కు సంబంధించిన పూర్తి ఫీచర్స్ తెలియాల్సి ఉంది. త్వరలోనే భారతీయ రోడ్లపైకి ఎంజీ కామెట్ ఈవీ రానుంది. లాంఛింగ్ తర్వాత మరిన్ని వివరాలు తెలుస్తాయి. (image: MG Motor India)