1. వేలంపాటలో రూ.1,100 కోట్లు ధర పలికిన కార్ ఇదే. ఈ కార్ పేరు మెర్సిడిస్ బెంజ్. 1955 మోడల్. పూర్తి పేరు మెర్సిడిస్ బెంజ్ 300 ఎస్ఎల్ఆర్. ఈ కారును వేలం పాటలో 135 మిలియన్ యూరోలకు కొన్నారు. అంటే 143 మిలియన్ డాలర్లు. భారతీయ కరెన్సీ ప్రకారం ఈ కారును రూ.1111,26,01,500 ధరకు కొన్నారు. అంటే 11 వందల 11 కోట్ల 26 లక్షల 1 వేయి 500 రూపాయలు. (image: Wikipedia)
3. గతంలో 1962 నాటి ఫెరారీ 250 జీటీఓ కార్‌ను 2018లో వేలం వేస్తే 48 మిలియన్ డాలర్ల ధర పలికింది. ప్రస్తుత కరెన్సీ ప్రకారం చూస్తే రూ.373 కోట్లు. ఈ రికార్డును మెర్సిడిస్ బెంజ్ 300 ఎస్ఎల్ఆర్ బద్దలు కొట్టింది. సుమారు మూడు రెట్ల ధర పలికింది. ప్రపంచంలో ఇంత ఖరీదు పలికిన కారుగా రికార్డు నమోదైంది. (image: Wikipedia)
4. జర్మనీలోని మెర్సిడిస్ బెంజ్ మ్యూజియంలో మే 5న ఈ వేలం పాట జరిగింది. ఈ వేలంపాటకు ఇన్విటేషన్ ఉన్నవారినే మాత్రమే అనుమతించారు. వేలంపాటలో అమ్ముడుపోయిన టాప్ 10 అత్యంత విలువైన వస్తువులలో ఈ కార్ కూడా చేరింది. AFP ర్యాంకింగ్ ప్రకారం ఇటీవల కాలంలో వేలంలో అముడుపోయిన కళాకృతుల 300 SLR ఆరు లేదా ఏడవ స్థానంలో ఉంది. (image: Wikipedia)
5. ఆల్ టైమ్ హై విషయానికి వస్తే లెనార్డో డావిన్సీకి చెందిన సాల్వేటర్ ముండీ 450.3 మిలియన్ డాలర్లకు 2017 నవంబర్‌లో అమ్ముడుపోయింది. ఆ తర్వాత ఆండీ వార్హోల్ షాట్ సేగ్ బ్లూ మారిలిన్ ఈ నెలలోనే 195 మిలియన్ డాలర్లకు అమ్ముడు పోయింది. కార్ల విషయానికి వస్తే మెర్సిడిస్ బెంజ్ 300 ఎస్ఎల్ఆర్ టాప్‌లో ఉంది. (image: Wikipedia)
6. మెర్సిడెస్-బెంజ్ రేసింగ్ డిపార్ట్మెంట్ రూపొందించిన రెండు నమూనాల్లో ఈ కారు ఒకటి. ఈ కారు సృష్టికర్త, చీఫ్ ఇంజనీర్ రుడాల్ఫ్ ఉహ్లెన్‌హాట్ పేరు పెట్టారు. ఈ కారును ప్రత్యేక సందర్భాలలో ప్రజలు చూసేందుకు అందుబాటులో ఉంటుందని ప్రైవేట్ కొనుగోలుదారు అంగీకరించడం విశేషం. ఇక రెండో కారు కంపెనీ యాజమాన్యం దగ్గరే ఉంటుంది. మెర్సిడెస్-బెంజ్ మ్యూజియంలో చూడొచ్చు. (image: Wikipedia)
7. మెర్సిడిస్ బెంజ్ 300 ఎస్ఎల్ఆర్ కార్ విశేషాలు చూస్తే అసాధారణ ఉండే గీతలు, బటర్‌ఫ్లై డోర్స్ ఆకట్టుకుంటాయి. 1954, 1955లో ఇటాలియన్ జువాన్ మాన్యుయెల్ ఫాంగియో డ్రైవింగ్‌లో రెండు ఫార్ములా 1 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లు గెలుచుకోవడం విశేషం. కానీ 1955 జూన్‌లో ఓ విషాదం జరిగింది. 24 అవర్స్ ఆఫ్ లే మాన్స్ రేసులో 300 SLR వాహనాల్లో ఒకటి ప్రమాదానికి గురికావడంతో ఫ్రెంచ్ డ్రైవర్ పియర్ లెవెగ్, 83 మంది ప్రేక్షకులు మరణించారు. (image: Wikipedia)