ఢిల్లీలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో ఇప్పటికే ఈ న్యూ మోడల్ స్విఫ్ట్ కారును తొలిసారి మార్కెట్లో ప్రవేశపెట్టారు. కాగా కారు డెలివరీని జనవరి నుంచి అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. దీని ప్రారంభ ధర ఎక్స్‌షోరూం ప్రకారం రూ. 5 లక్షలుగా ఉండనుంది. ఇక టాప్ వేరియంట్ రూ.8.00 లక్షలకు లభిస్తుందని ఆటో నిపుణులు అంచనా వేస్తున్నారు.
కొత్త స్విఫ్ట్ పెట్రోల్, వేరియంట్లలో లభిస్తుంది. 1.2 లీటర్ కె-సిరీస్ పెట్రోల్, 1.3 లీటర్ డీడీఐఎస్ డీజిల్ ఇంజిన్లను కొత్త స్విఫ్ట్‌లోనూ వాడారు. 2005లో భారత్‌లో అమ్మకాలు మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకూ 18 లక్షల యూనిట్ల స్విఫ్ట్‌లను విక్రయించారు. భారత్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్-5 కార్లలో ఒకటిగా స్విఫ్ట్ నిలిచింది.