మారుతీ సుజుకీ కంపెనీ ఈ ఏడాది ఫిబ్రవరిలో అప్డేటెడ్ వ్యాగనార్ తీసుకువచ్చింది. ప్రస్తుతం దీని రేటు రూ. 5.47 లక్షల నుంచి రూ. 7.2 లక్షల వరకు ఉంది. ఇవ్వన్నీ ఎక్స్‌షోరూమ్ ధరలు. 2022 ఏడాదిలో ఈ కారు బెస్ట్ సెల్లింగ్ కారుగా నిలిచింది. దేశంలో 2 లక్షల యూనిట్ల మార్క్‌ను దాటిన ఒకే ఒక కారు ఇదే కావడం గమనార్హం.
ఈ కారులో 1.0 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్, 1.2 లీటర్ 4 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లలో ఈ కారు లభిస్తోంది. 1.0 లీటర్ ఇంజిన్ కారు లీటరుకు 25 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తోంది. సీఎన్జీ వేరియంట్ అయితే కేజీకి 34 కిలోమీటర్లకు పైగా మైలేజ్ ఇస్తుంది. 1.2 లీటర్ ఇంజిన్ కారు అయితే లీటరుకు 24 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది.
మారుతీ సుజుకీ వ్యాగనార్ కారులో 7 ఇంచుల స్మార్ట్‌ప్లే స్టూడియో టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, నావిగేషన్, క్లౌడ్ బేస్డ్ సర్వీస్, డ్యూయెల్ ఫ్రంట్ ఎయిర్బ్యాగ్స, ఏబీఎస్, ఈబీడీ, రివర్స్ పార్కింగ్ సెన్సార్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఫోర్ స్పీకర్లు, సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఏఎంటీ వంటి ప్రత్యేకలు ఉన్నాయి. ఈ కారు పలు రంగుల్లో లభిస్తోంది.