1. డీజిల్, పెట్రోల్ కార్లతో పోలిస్తే సీఎన్జీ (CNG) ఫ్యూయల్ కార్ల రన్నింగ్ కాస్ట్ తక్కువగా ఉంటుంది. పర్యావరణానికి హితమైన ఈ కార్లలో మైలేజ్ కూడా ఎక్కువగా వస్తుంది. అందుకే ఇండియాలో వీటి కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి 'ఎస్-ప్రెస్సో సీఎన్జీ’ (S-Presso CNG) కారును ఇండియాలో లాంచ్ చేసింది. (image: Maruti Suzuki)
2. పెట్రోల్‌తో నడిచే ఎస్-ప్రెస్సో కారుతో పోలిస్తే.. ఈ కొత్త CNG హ్యాచ్‌బ్యాక్ కారు ధర రూ.95,000 ఎక్కువగా ఉంది. మారుతి సుజుకి S-Presso CNG రూ.5.90 లక్షల (ఎక్స్-షోరూమ్, న్యూఢిల్లీ) స్టార్టింగ్ ప్రైస్‌తో లాంచ్ అయింది. దీని టాప్ వేరియంట్ ధర రూ.6.10 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. (image: Maruti Suzuki)
4. ఇది CNG మోడ్‌లో 5,300 rpm వద్ద 56 bhp, 3,400 rpm వద్ద 82.1 Nm గరిష్ఠ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. పెట్రోల్ వెర్షన్‌తో పోలిస్తే దీని పవర్ 9 బీహెచ్పీ, టార్క్ 7 ఎన్ఎమ్ తక్కువ. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే వస్తుంది. 1 కిలో సీఎన్జీ ఫ్యూయల్‌కి 32.73 కిమీ మైలేజీని ఇస్తుంది. (image: Maruti Suzuki)
5. ఎస్-ప్రెస్సో సీఎన్జీలో డ్యూయల్ ఇంటర్‌డిపెండెంట్ ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్ (ECUs)లను అందించారు. ఇంజన్లో మెరుగైన ఎయిర్-ఫ్యూయల్ మిక్సింగ్ కోసం మెరుగైన ఇంజెక్షన్ సిస్టమ్ కూడా ఆఫర్ చేశారు. సీఎన్జీ స్ట్రక్చర్‌లో లీకేజీ సమస్యను అధిగమించేందుకు కొత్త స్టెయిన్లెస్ స్టీల్ పైపులు, జాయింట్స్ సైతం ఆఫర్ చేశారు. (image: Maruti Suzuki)
6. ఫ్యూయల్ ఫిల్ చేసేటప్పుడు ఇంజన్‌ను కట్ ఆఫ్ చేసే సేఫ్టీ స్విచ్‌లు కూడా ఇందులో ఉన్నాయి. అప్డేటెడ్ పవర్‌ట్రెయిన్ కోసం సస్పెన్షన్ సెటప్‌ను కొత్తగా తీసుకొచ్చారు. ఈ కారు టెయిల్‌గేట్‌పై ఎక్స్ట్రా S-CNG బ్యాడ్జ్ ఉంటుంది. ఇక దాని ఎక్స్టీరియర్ లేదా ఇంటీరియర్ డిజైన్‌లో పెద్దగా మార్పులు లేవు. కాగా ఈ హ్యాచ్‌బ్యాక్ బూట్లో 55-లీటర్ CNG ట్యాంక్‌ను అందించారు. (image: Maruti Suzuki)
7. ఎస్-ప్రెస్సో సీఎన్జీలో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్, EBDతో కూడిన ABS, రియర్ పార్కింగ్ సెన్సార్లు, సీట్ బెల్ట్ రిమైండర్స్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. ఈ సీఎన్జీ కారు కాన్సెప్ట్, డిజైన్, డెవలప్మెంట్ పనులన్నీ మారుతి సుజుకి రీసెర్చ్ & ; డెవలప్మెంట్ ఫెసిలిటీలోనే పూర్తయ్యాయి. (image: Maruti Suzuki)