మార్కెట్ ట్రెండ్‌ను అర్థం చేసుకోవడంలో ఇండియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ (Indian Automobile Industry) విజయవంతం అవుతోంది. గతంలో కేవలం అక్టోబర్ నుంచి మొదలయ్యే ఫెస్టివల్ సీజన్లో కార్ల అమ్మకాలు పెంచుకోవడంపైనే కంపెనీలు ఎక్కువ దృష్టి పెట్టేవి. కానీ కరోనా తర్వాత వినియోగదారుల కొనుగోలు అలవాట్లు మారటం, కార్ల అమ్మకాలు పెరగడంతో.. నెలవారీ అమ్మకాల్లో వీలైనంత ఎక్కువ వృద్ధి సాధించడానికి ప్రధాన కంపెనీలు ప్రణాళికలు వేస్తున్నాయి.
* టాటా మోటార్స్ డిస్కౌంట్లు : మార్చి నెలలో టాప్ సెల్లింగ్ వెహికల్స్‌పై టాటా మోటార్స్ మంచి ఆఫర్లు అందిస్తోంది. టాటా హారియర్, టాటా సఫారీపై రూ.45,000 వరకు డిస్కౌంట్ ఉంది. కంపెనీ టియాగో మోడల్‌పై రూ. 28,000 వరకు, టిగోర్ వెహికల్‌పై రూ. 30,000 వరకు స్పెషల్ డిస్కౌంట్స్, బెనిఫిట్స్ అందిస్తోంది. టాటా ఆల్ట్రోజ్ ధర రూ. 28,000 వరకు తగ్గింది. కంపెనీ నుంచి అత్యధికంగా అమ్ముడైన ప్యాసింజర్ వెహికల్ టాటా నెక్సాన్‌పై ఈ నెలలో రూ.3,000 కార్పొరేట్ డిస్కౌంట్ ఉంది.
* హ్యుందాయ్ ఆఫర్లు : హ్యుందాయ్ కంపెనీ మార్చిలో గ్రాండ్ ఐ10 నియోస్, ఐ20, ఆరా వంటి పాపులర్ మోడళ్లపై మంచి డిస్కౌంట్లను అందిస్తోంది. హ్యుందాయ్ ఐ20పై రూ.20,000, హ్యుందాయ్ ఆరాపై రూ.33,000 వరకు డిస్కౌంట్స్ ఉన్నాయి. కస్టమర్లు గ్రాండ్ ఐ10 నియోస్‌పై ఈ నెలలో రూ.38,000 వరకు ఆఫర్లు, బెనిఫిట్స్ సొంతం చేసుకోవచ్చు. అయితే క్రెటా, వెన్యూ, అల్కాజర్, టక్సన్ వంటి SUV మోడళ్లపై కంపెనీ ప్రస్తుతం ఎలాంటి ఆఫర్లు అందించట్లేదు.
* మారుతి సుజుకి డిస్కౌంట్లు : ఈ నెలలో మారుతి సుజుకి సెలెరియోను రూ.44,000 ధరకు కొనుగోలు చేయవచ్చు. ఆల్టోను రూ.38,000 ధరకు సొంతం చేసుకోవచ్చు. అలాగే ఆల్టో K10, మారుతి సుజుకి S-ప్రెస్సోపై రూ. 49,000 వరకు డిస్కౌంట్ ఉంది. వీటితో పాటు వ్యాగన్ఆర్ మోడల్‌పై రూ.64,000, స్విఫ్ట్‌పై రూ.54,000, మారుతి సుజుకి డిజైర్‌పై రూ.10,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు.