1. మారుతీ సుజుకీ ఇండియా సరికొత్త ఫీచర్స్‌తో మారుతీ సుజుకీ ఈకో 2022 (Maruti Suzuki Eeco 2022) మోడల్‌ను పరిచయం చేసింది. భారతదేశంలో మారుతీ సుజుకీ (Maruti Suzuki) ఈకో ఎక్కువగా అమ్ముడు పోతున్న వ్యాన్ అని కంపెనీ చెబుతోంది. ఈ సెగ్మెంట్లో పట్టు నిలుపుకోవడం కోసం లేటెస్ట్ మోడల్‌ను తీసుకొచ్చింది. (image: Maruti Suzuki India)
2. కుటుంబానికి సౌకర్యవంతంగా, విశాలమైన కార్ కావాలనుకునేవారికి ప్రత్యేక ఫీచర్స్ అందిస్తోంది. ఎక్కువ ఇంటీరియర్ స్పేస్ కావాలనుకునే వ్యాపారులకు కూడా ఇది బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తుంది. మారుతీ సుజుకీ ఈకో 2022 మొత్తం 13 వేరియంట్లలో లభిస్తుండటం విశేషం. పెట్రోల్, సీఎన్జీ వేరియంట్లలో లభిస్తుంది. (image: Maruti Suzuki India)
3. మారుతీ సుజుకీ ఈకో 2022 5-సీటర్, 7-సీటర్, కార్గో, టూర్, అంబులెన్స్ ఆప్షన్స్‌లో లభిస్తుంది. ప్రారంభ ధర రూ.5.13 లక్షలు. ఇది ఎక్స్-షోరూమ్ ధర. 5-సీటర్ వేరియంట్ కొనొచ్చు. ఇక 7-సీటర్ వేరియంట్ ప్రారంభ ధర రూ.5.42 లక్షలు. వేరియంట్‌ను బట్టి ధర మారుతుంది. హైఎండ్ మోడల్ ధర రూ.8 లక్షల వరకు ఉంటుంది. (image: Maruti Suzuki India)
5. న్యూ ఈకో పెట్రోల్ వెర్షన్ S-CNG మోడల్ కంటే 25% ఎక్కువ ఫ్యూయెల్ ఎఫీషియంట్ కలిగి ఉందని కంపెనీ చెబుతోంది. ఇక కొత్త మారుతీ సుజుకీ ఈకో ఎస్ సీఎన్జీ వర్షన్ 29 శాతం ఎక్కువగా ఫ్యూయెల్ ఎఫీషియెన్సీ కలిగి ఉందని కంపెనీ వెల్లడించింది. మైలేజ్ విషయానికి వస్తే పెట్రోల్ కార్ లీటర్‌కు 19.71 కిలోమీటర్లు, కేజీ సీఎన్జీకి 26.78 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. (image: Maruti Suzuki India)
6. మారుతీ సుజుకీ ఈకో 2022 మెటాల్లిక్ బ్రిస్క్ బాడీ బ్లూ, సాలిడ్ వైట్, పెరల్ మిడ్నైట్ బ్లాక్, మెటాల్లిక్ సిల్వర్ గ్రే, మెటాల్లిక్ గ్లిస్టెనింగ్ గ్రే కలర్స్‌లో లభిస్తుంది. వ్యాన్ లోపల సౌకర్యవంతంగా ఉంటుంది. డ్రైవర్ ఫోకస్డ్ కంట్రోల్స్, రిక్లైనింగ్ ఫ్రంట్ సీట్లు, క్యాబిన్ ఎయిర్-ఫిల్టర్, బ్యాటరీ సేవర్ ఫంక్షన్‌తో డోమ్ ల్యాంప్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. (image: Maruti Suzuki India)
7. వ్యాన్‌లో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, కొత్త స్టీరింగ్ వీల్, ఏసీ, హీటర్ లాంటివి కూడా ఉన్నాయి. ఇంజిన్ ఇమ్మొబిలైజర్, ఇల్యూమినేటెడ్ హజార్డ్ స్విచ్, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఈడీబీతో ఏబీఎస్, స్లైడింగ్ డోర్లు, చైల్డ్ లాక్, రివర్స్ పార్కింగ్ సెన్సార్ లాంటి భద్రతా ఫీచర్స్ కూడా ఇందులో ఉన్నాయి. (image: Maruti Suzuki India)