Maruti Car Offers | మీరు కొత్తగా కారు కొనేందుకు రెడీ అవుతున్నారా? అయితే మీకోసం అదిరిపోయే ఆఫర్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఎలా అని అనుకుంటున్నారా? దిగ్గజ కార్ల తయారీ కంపెనీ అయిన మారుతీ సుజుకీ కార్లపై కళ్లుచెదిరే డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు. ఏకంగా రూ. 50 వేల వరకు డబ్బులు ఆదా చేసుకోవచ్చు. కార్లపై ఉన్న డిస్కౌంట్ ఆఫర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మారుతీ సుజుకీ సియాజ్ కారుపై అయితే రూ. 40 వేల వరకు తగ్గింపు పొందొచ్చు. మ్యానువల్ వేరియంట్లకు ఇది వర్తిస్తుంది. అదే ఆటోమేటిక్ వేరియంట్లపై అయితే రూ. 30 వేల వరకు తగ్గింపు లభిస్తుంది. సియాజ్ కారు హోండా సిటీ కారు గట్టి పోటీ ఇస్తున్న విషయం తెలిసిందే. హ్యుందాయ్ వెర్నా, స్కోడా స్లేవియా, ఫోక్స్‌వ్యాగన్ వెర్చుస్ వంటి మోడళ్లకు ఇది పోటీ ఇస్తోంది.