1. మారుతీ సుజుకీ విటారా బ్రెజా (Maruti Suzuki Vitara Brezza) మోడల్ ఇప్పటికే మార్కెట్లో ఉంది. మారుతీ సుజుకీ విటారా బ్రెజా 7,50,000 పైగా యూనిట్స్ అమ్ముడవడం విశేషం. ఇప్పుడు మారుతీ సుజుకీ బ్రెజా సెకండ్ జనరేషన్ మార్కెట్లోకి వచ్చేసింది. కొత్త మోడల్లో విటారా పేరును తొలగించింది కంపెనీ. (Photo: Maruti Suzuki)
2. మారుతీ సుజుకీ బ్రెజా సెకండ్ జనరేషన్ బేసిక్ మోడల్ ఎక్స్‌షోరూమ్ ధర రూ.7,99,000. మారుతీ సుజుకీ బ్రెజా 2022 హైఎండ్ మోడల్ ధర రూ.13,96,000. మారుతీ సుజుకీ బ్రెజా బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమైంది. 8 రోజుల్లో 45,000 పైనే బుకింగ్స్ జరగడం విశేషం. అంటే నిమిషానికి 4 బుకింగ్స్ రావడం విశేషం. (Photo: Maruti Suzuki)
3. మారుతీ సుజుకీ బ్రెజా 2022 LXi, VXi, ZXi, ZXi dual tone, ZXi+, ZXi+ dual tone మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. ఎక్స్‌షోరూమ్ ధరలు చూస్తే LXi మోడల్ ధర రూ.7,99,000, VXi మోడల్ ధర రూ.9,46,500, ZXi మోడల్ ధర రూ.10,86,500, ZXi dual tone మోడల్ ధర రూ.11,02,500, ZXi+ మోడల్ ధర రూ.12,30,000, ZXi+ dual tone మోడల్ ధర రూ.12,45,000. (Photo: Maruti Suzuki)
4. మారుతీ సుజుకీ బ్రెజా 2022 ఫీచర్స్ చూస్తే ఇందులో K15C 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇదే ఇంజిన్ కొత్త ఎర్టిగా, ఎక్స్ఎల్6 మోడల్స్‌లో ఉంది. 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమెటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ ఎంచుకోవచ్చు. ఇందులో 9 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంది. ARKAMYS సౌండ్ సిస్టమ్ లభిస్తుంది. ఇటీవల రిలీజైన బాలెనో మోడల్లో కూడా ఇదే సిస్టమ్ ఉంది. (Photo: Maruti Suzuki)
5. మారుతీ సుజుకీ బ్రెజా 2022 టాప్ మోడల్లో హెడ్స్ అప్ డిస్ప్లే ఉంటుంది. ఇందులో స్పీడ్, ఆర్పీఎం లెవెల్ లాంటి వివరాలు తెలుసుకోవచ్చు. కొత్త బ్రెజాలో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ ఏర్పాటు చేసింది కంపెనీ. సేఫ్టీ విషయానికి వస్తే ఆరు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. 360 డిగ్రీల కెమెరా కూడా ఉంది. యాంబియెంట్ లైటింగ్, వైర్లెస్ ఛార్జింగ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. (Photo: Maruti Suzuki)
6. మారుతీ సుజుకీ బ్రెజా 2022 కార్ ఆరు సింగిల్ టోన్, మూడు డ్యూయెల్ టోన్ కలర్స్లోకొనొచ్చు. డ్యూయెల్ టోన్‌లో సిజ్లింగ్ రెడ్‌తో మిడ్నైట్ బ్లాక్ రూఫ్, బ్రేవ్ ఖాకీతో ఆర్కిటిక్ వైట్ రూఫ్, స్ప్లెండిడ్ సిల్వర్‌తో మిడ్నైట్ బ్లాక్ రూఫ్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. సింగిల్ టోన్ కలర్స్ చూస్తే బ్రేవ్ ఖాకీ, ఎక్స్యుబరెంట్ బ్లూ, మాగ్మా గ్రే, పెరల్ ఆర్కిటిక్ వైట్, సిజ్లింగ్ రెడ్, స్ప్లెండిడ్ సిల్వర్ కలర్స్‌లో కొనొచ్చు. (Photo: Maruti Suzuki)