Maruti Alto 800 VXI Plus: మారుతి సుజుకి కంపెనీ నుంచి విడుదలైన Alto 800 కారు ఇప్పటికే దేశంలోనే అత్యధికంగా అమ్ముడుపోయిన కార్లలో ఒకటిగా పేరొందింది. మారుతి సంస్థ ఉత్పత్తి చేస్తున్న కార్లలో ఆల్టో కారుదే సింహ భాగం. అయితే ఆల్టో నుంచి ఇఫ్పటికేఆల్టో విఎక్స్ఐ+ వేరియంట్‌ను విడుదల చేయగా మంచి సేల్స్ సాధించింది.
Maruti Alto 800 VXI Plusలో స్మార్ట్‌ప్లే 2.0తో పాటు 7.0-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కూడా ఉంది. వాగన్ఆర్, బాలెనో, సియాజ్, స్విఫ్ట్, స్విఫ్ట్ డిజైర్ తరహాలోనే ఇప్పుడు ఆల్టో వంటి ఇతర మోడళ్లలోకి కూడా ఈ కొత్త ఫీచర్స్ ని అప్ గ్రేడ్ చేశారు. ప్రస్తుత ధర దీని ధర New Delhi లో రూ.3.89 లక్షలు (Ex-showroom)గా ఉంది.
కొత్త Maruti Alto 800 VXI Plusలో 796 సిసి, త్రీ సిలిండర్ల ఇంజిన్ తో వస్తుంది. ఇది ఇప్పుడు బిఎస్ 6 ప్రమాణాలకు అనుగుణంగా 25 శాతం తక్కువ నైట్రోజన్ ఆక్సైడ్ ను విడుదల చేస్తుంది. 6000 ఆర్‌పిఎమ్ వద్ద 47 బిహెచ్పి, 3500 ఆర్‌పిఎమ్ వద్ద 69 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. కొత్త భద్రతా నిబంధనలకు అనుగుణంగా మారుతి సుజుకి ఆల్టో 800 లో డ్రైవర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఎబిఎస్), ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (ఇబిడి), రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, సీట్-బెల్ట్ రిమైండర్ మరియు స్పీడ్ అలర్ట్ ఫీచర్స్ ఉన్నాయి.