1. మంగళూరులో పేలుడు కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీని వెనుక ఉగ్రకోణం ఉందని కర్నాటక పోలీసులు తెలపడం సంచలనంగా మారింది. ఆటో పేలుడు ప్రమాదవశాత్తు జరగలేదని, ఉగ్రవాదుల కుట్ర కోణంపై దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు ప్రకటించారు. పోలీసులు దర్యాప్తు చేస్తుంటే రైల్వే ఉద్యోగి ప్రేమ్‌రాజ్ హుటాగి పేరు బయటకు వెచ్చింది. ఆయన జీవితంలో ఒక్కసారి కూడా పోలీస్ స్టేషన్‌కు వెళ్లలేదు. (ప్రతీకాత్మక చిత్రం)
2. కానీ పోలీసుల నుంచి ఫోన్ కాల్ రావడంతో ఉలిక్కిపడ్డాడు. చివరకు తేలింది ఏంటంటే ఈ పేలుడు వెనుక ఉన్న ప్రధాన నిందితుడు ప్రేమ్‌రాజ్ హుటాగి ఆధార్ కార్డును ఉపయోగించాడు. పోలీసుల దర్యాప్తులో ప్రేమ్‌రాజ్ హుటాగికి, ఈ పేలుడుకు సంబంధం లేదని తేలింది. కానీ అతని ఆధార్ వివరాలు ఎలా ఉపయోగించాడన్నది ఆసక్తికరంగా మారింది. (ప్రతీకాత్మక చిత్రం)
3. పోలీసులు ఇంకాస్త లోతుగా ప్రశ్నిస్తే అసలు విషయం బయటపడింది. ప్రేమ్‌రాజ్ హుటాగి గత రెండేళ్లలో రెండుసార్లు ఆధార్ కార్డ్ పోగొట్టుకున్నాడు. ఆరు నెలల క్రితం తుమకూరు నుంచి తన సొంతూరైన హుబ్బళి వెళ్తుండగా ఆధార్ కార్డ్ పోయింది. అదే ఆధార్ కార్డును మంగళూరు బ్లాస్ట్ నిందితుడు ఉపయోగించాడు. ఆధార్ కార్డ్ పోగొట్టుకున్న ప్రేమ్‌రాజ్ హుటాగి ఆధార్ వెబ్సైట్లో కంప్లైంట్ చేసి కొత్త కార్డ్ తీసుకున్నాడు. (ప్రతీకాత్మక చిత్రం)
4. "ఆధార్ కార్డుపై యూనిక్ ఐడీ నెంబర్ ఉంటుంది కాబట్టి నేను పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. కొత్త కార్డ్ తీసుకున్నాను. మొదటిసారి ఆధార్ కార్డ్ పోయినప్పుడు డూప్లికేట్ కార్డ్ తీసుకున్నాను. కానీ నా పేరు, నా ఆధార్ కార్డును ఇలా దుర్వినియోగం చేస్తారని నేను అనుకోలేదు. విషయం తెలుసుకొని నేను షాకయ్యాను. పోలీసులు అడిగిన సమాచారం ఇచ్చాను" అని News18 తో ఫోన్లో వివరించారు ప్రేమ్‌రాజ్ హుటాగి. (ప్రతీకాత్మక చిత్రం)
6. "నిందితుడు షరీక్ తన గుర్తింపు కార్డుగా నకిలీ ఆధార్ కార్డును ఉపయోగించాడు. తుమకూరులోని ప్రేమ్‌రాజ్ హుటాగి రెండుసార్లు ఆధార్ కార్డు పోగొట్టుకున్నాడని తేలింది. ప్రజలు తమ ఐడీ కార్డులు, ఇతర డాక్యుమెంట్ల విషయంలో ఎలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడానికి ఇది ఒక క్లాసిక్ కేస్. వాటిని పోగొట్టుకుంటే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలి. అటువంటి పత్రాలు దుర్వినియోగం చేయొచ్చు. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంటుందో ఇప్పుడు మనం చూస్తున్నాం" అని డీజీపీ సూద్ News18 కి తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఈ ఘటన ద్వారా ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉండాలో తెలుస్తుంది. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ లాంటి ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఇంట్లో ఎక్కడైనా పారేసుకుంటే ఇబ్బంది లేదు. అవి ఎప్పుడైనా దొరకొచ్చు. కానీ బయట ఇలాంటి ముఖ్యమైన డాక్యుమెంట్స్ పోగొట్టుకున్నా, ఎవరైనా దొంగిలించినా ఏదో రకంగా చిక్కులు ఎదురుకావొచ్చు. పోగొట్టుకున్న డాక్యుమెంట్స్ దుర్వినియోగం అవుతాయన్న అనుమానం ఉంటే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలి. ఆధార్ కార్డ్ పోగొట్టుకుంటే ఆధార్ వివరాలు దుర్వినియోగం కాకుండా వాటిని లాక్ చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)