మోసగాళ్లు నయా మోసాలకు పాల్పడుతున్నారు. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ బ్యాంక్ కస్టమర్ల నుంచి డబ్బులు కొట్టేస్తున్నారు. అందుకే బ్యాంక్ అకౌంట్ కలిగిన వారు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యమైన సమచారాన్ని ఎవరితోనూ పంచుకోవచ్చు. తెలియని నంబర్ నుంచి కాల్స్ వస్తే మాట్లాడకూడదు. అలాగే ఈమెయిల్స్, ఎస్ఎంఎస్లకు స్పందించవద్దు.
దక్షిణ ఢిల్లీకి చెందిన సెక్యూరిటీ సర్వీసెస్ సంస్థ డైరెక్టర్ అకౌంట్ నుంచి మోసగాళ్లు రూ. 50 లక్షలు తస్కరించారు. ఈయనకు రాత్రి 7 గంటల నుంచి 8.45 గంటల మధ్యలో మిస్డ్ కాల్స్ వచ్చాయి. ఒక్కసారి కాదు చాలా సార్లు ఇలా మిస్డ్ కాల్స్ వచ్చాయి. కొన్ని కాల్స్‌ను ఈయన ఎత్తారు. అయితే అవతలి నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. అందువల్ల కట్ చేశారు. తర్వాత కాల్స్ లిఫ్ట్ చేయలేదు.