అంటే మీరు ఇలా పదేళ్ల ఇన్వెస్ట్ చేస్తే.. మీరు పెట్టిన డబ్బులు రూ. 5.21 లక్షలు అవుతాయి. మీకు వచ్చే రాబడి రూ. 4.8 లక్షలుగా ఉంటుంది. అదే మీరు సిప్ మొత్తాన్ని పెంచుకుంటే రాబడి కూడా పెరుగుతుంది. నెలకు రూ. 6,500 ఇన్వెస్ట్ చేస్తే (రోజుకు దాదాపు రూ.200 పొదుపు చేయాలి).. మీకు పదేళ్ల తర్వాత రూ. 15 లక్షలు లభిస్తాయి.
గత మూడేళ్ల కాలంలో చూస్తే.. కెనరా రొబెకో బ్లూచిప్ ఈక్విట్ ఫండ్ 12 శాతం రాబడిని ఇచ్చింది. కెనరా రొబెకో ఎమర్జింగ్ ఈక్విటీస్ ఫండ్ 16 శాతం, నిప్పాన్ ఇండియా వాల్యూ ఫండ్ 15 శాతం, పరాగ్ పరీఖ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ 18 శాతం చొప్పున రాబడిని అందించాయి. ఇకపోతే డబ్బులు ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఇన్వెస్ట్మెంట్ నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం. లేదంటే నష్టపోవాల్సి వస్తుంది.