1. కరోనా కారణంగా గత రెండేళ్ల నుంచి ఆటోమొబైల్ పరిశ్రమ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. కరోనాతో వాహన తయారీ, సరఫరాలో ఏర్పడ్డ ఇబ్బందుల కారణంగా అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. మరోవైపు, బుక్ చేసుకున్న కస్టమర్లకు వాహన డెలివరీలు ఆలస్యంగా అందుతున్నాయి. అయితే ఈ గడ్డు పరిస్థితుల్లోనూ దేశీయ దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra and Mahindra) సరికొత్త రికార్డు నెలకొల్పింది. (Image: Arjit Garg/News18.com)
2. మహీంద్రాకు చెందిన తాజా ఎక్స్‌యూవీ 700 (Mahindra XUV700) వాహనం సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. గురువారం నాటికి లక్ష వాహనాల బుకింగ్స్ నమోదు చేసింది. 2021 అక్టోబర్ 7న మార్కెట్లోకి లాంచ్ అయిన ఈ వాహనం తక్కువ సమయంలోనే లక్ష బుకింగ్స్ నమోదు చేసిన ఎస్‌యూవీగా రికార్డుకెక్కింది. (Image: Arjit Garg/News18.com)
3. మరోవైపు, గ్లోబల్ సప్లయ్ చైన్ సమస్యలు ఉన్నప్పటికీ విడుదలైన 90 రోజుల్లోనే 14 వేల వాహనాల డెలివరీలను పూర్తి చేసింది. తమ కస్టమర్ల పట్ల సంస్థకు ఉన్న నిబద్దతకు ఇది నిదర్శనమని తెలియజేసింది. మిగతా కస్టమర్లకు సైతం సాధ్యమైనంత త్వరగా వాహనాలను డెలివరీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని మహీంద్రా అండ్ మహీంద్రా స్పష్టం చేసింది. (Image: Arjit Garg/News18.com)
4. అధిక డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని వాహన తయారీని వేగవంతం చేసినప్పటికీ అసాధారణ రీతిలో బుకింగ్స్ వస్తున్నాయని వెల్లడించింది. ఫలితంగా ఎక్స్‌యూవీ బుకింగ్ చేసుకున్న వారు 6 నుంచి 10 నెలలు వేచి చూడాల్సి వస్తోందని తెలిపింది. మరోవైపు, మహీంద్రా AX7 సిరీస్ కారు కోసం 12 నెలలకు పైగా వెయిట్ చేయాల్సి వస్తున్నట్లు పేర్కొంది. (Image: Arjit Garg/News18.com)
6. ఐదు నుంచి ఏడు సీట్ల ఎక్స్‌యూవీ 700 మోడళ్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మహీంద్రా ఎక్స్‌యూవీ 700 కారు ఎంఎక్స్, ఏఎక్స్ (అడ్రెనోఎక్స్) బ్రాడ్ ట్రిమ్ వేరియంట్లలో లభిస్తుంది. అడ్రెనోఎక్స్ మోడల్ ఏఎక్స్3, ఏఎక్స్5, ఏఎక్స్7 అనే మూడు సబ్ ట్రిమ్‌లలో అందుబాటులో ఉంటుంది. (Image: Arjit Garg/News18.com)