మహీంద్రా నుంచి రానున్న ఆటమ్ చిన్న ఎలక్ట్రిక్ కారు ప్రారంభ ధర రూ. 3 లక్షల నుంచి ఉండొచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో దీనికి పోటీ ఇచ్చే వెహికల్స్ లేవు. భవిష్యత్‌లో ఏ కంపెనీ అయినా ఇలాంటి వెహికల్స్ తీసుకువస్తుందేమో చూడాలి. బజాజ్ కంపెనీ పోటీగా వెహికల్ తీసుకురావొచ్చు. కాగా మరోవైపు మహీంద్రా అండ్ మహీంద్రా కార్లకు మార్కెట్లో ఇప్పుడు ఫుల్ డిమాండ్ ఉంది. ఎక్స్‌యూవీ 700, కొత్త స్కార్పియో వంటి మోడళ్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. వీటి వెయిటింగ్ పీరియడ్ ఏకంగా రెండేళ్ల వరకు ఉంది. అంటే వీటికి ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.