1. కొత్త కార్ కొనాలనుకుంటున్నారా? మహీంద్రా అండ్ మహీంద్రా కొన్ని మోడళ్ల కార్లపై భారీగా డిస్కౌంట్స్ ప్రకటించింది. క్యాష్ బెనిఫిట్స్, ఎక్స్ఛేంజ్ ఆఫర్స్, లాయల్టీ లాంటి వేర్వేరు ప్రయోజనాలు కల్పిస్తోంది. మహీంద్రా నుంచి వచ్చిన ఆరు మోడళ్లపై డిస్కౌంట్స్ పొందొచ్చు. గరిష్టంగా రూ.81,500 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. కనీసం రూ.13,000 డిస్కౌంట్ లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. మహీంద్రా ఎక్స్‌యూవీ 700, మహీంద్రా థార్ వాహనాలపై ఎలాంటి డిస్కౌంట్ లేదు. మహీంద్రా ఎక్స్‌యూవీ 700 ధర రూ.12 లక్షల నుంచి రూ.24 లక్షల మధ్య, ధర రూ.16 లక్షల నుంచి రూ.19 లక్షల వరకు ఉంటుంది. ఈ రెండు వాహనాలు తప్ప మహీంద్రా కంపెనీకి చెందిన ఇతర ఎస్యూవీ, ఎంపీవీ వాహనాలపై డిస్కౌంట్స్ ఉన్నాయి. ఏ కారుపై ఎంత డిస్కౌంట్ పొందొచ్చో తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
3. Mahindra Alturas: మహీంద్రా ఆల్ట్రాస్ ఎస్యూవీ కొంటే రూ.81,500 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ రూ.50,000 లభిస్తుంది. కార్పొరేట్ డిస్కౌంట్ రూ.11,500 పొందొచ్చు. ఇతర ఆఫర్ల కింద మరో రూ.20,000 తగ్గింపు లభిస్తుంది. మహీంద్రా ఆల్ట్రాస్ ఎస్యూవీ ధర రూ.28 లక్షల నుంచి రూ.31 లక్షల వరకు ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. Mahindra XUV300: మహీంద్రా ఎక్స్‌యూవీ300 కొనేవారికి గరిష్టంగా రూ.69,002 రివార్డ్స్ లభిస్తాయి. క్యాష్ రివార్డ్స్ రూ.30,000 వరకు లభిస్తాయి. ఎక్స్ఛేంజ్ ఇన్సెంటీవ్ రూ.25,000 పొందొచ్చు. కార్పొరేట్ డిస్కౌంట్ మరో రూ.4,500 లభిస్తుంది. మహీంద్రా ఎక్స్‌యూవీ300 ధర రూ.8 లక్షల నుంచి రూ.13 లక్షల వరకు ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. Mahindra KUV100: మహీంద్రా కేయూవీ100 నెక్స్ట్ కొనేవారికి రూ.61,055 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. క్యాష్‌బ్యాక్ రూ.38,055 పొందొచ్చు. రూ.20,000 ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్, రూ.3,000 కార్పొరేట్ డిస్కౌంట్ లభిస్తుంది. మహీంద్రా కేయూవీ100 నెక్స్ట్ ధర రూ.6 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. Mahindra Marazzo: మహీంద్రా మరాజో ఎంపీవీ కారు కొనేవారికి రూ.40,200 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. క్యాష్ రివార్డ్ కింద రూ.20,000 లభిస్తుంది. ఎక్స్ఛేంద్ వ్యాల్యూ కింద మరో రూ.15,000 తగ్గింపు పొందొచ్చు. కార్పొరేట్ ఇన్సెంటీవ్ మరో రూ.5,200 లభిస్తుంది. మహీంద్రా మరాజో ధర రూ.13 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)