1. తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికులు వందే భారత్ రైలు (Vande Bharat Train) కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. పలు రూట్లల్లో వందే భారత్ రైళ్లు వస్తాయన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. భారతీయ రైల్వే కూడా కొన్ని రూట్లను పరిశీలిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఏ రూట్లో వందే భారత్ ట్రైన్ వస్తుందా అన్న సస్పెన్స్ కనిపిస్తోంది. (image: Indian Railways)
2. తాజాగా మహారాష్ట్రకు చెందిన మంత్రి ఓ డిమాండ్ చేయడం చర్చనీయాంశమైంది. నాగ్‌పూర్ నుంచి హైదరాబాద్‌కు వందే భారత్ రైలు కావాలని మహారాష్ట్ర కేబినెట్ మంత్రి సుధీర్ ముంగన్‌తివార్ డిమాండ్ చేశారు. మహారాష్ట్ర విదర్భ ప్రాంతానికి, తెలంగాణ రాజధానికి హైదరాబాద్‌కు వ్యాపార సంబంధాలు ఉన్నాయని ఆయన చెబుతున్నారు. (image: Indian Railways)
3. నాగ్‌పూర్, గోండియా, భండారా, చంద్రాపూర్ జిల్లాలు మహారాష్ట్ర విదర్భ పరిధిలోకి వస్తాయి. ఈ ప్రాంతానికి, హైదరాబాద్‌కు వ్యాపార సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఈ రూట్లో వందే భారత్ రైలు నడిపితే ప్రయాణికులకు ఉపయోగకరంగా ఉంటుందన్నది ఆయన వాదన. ఇదే డిమాండ్‌తో కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు సుధీర్ ముంగన్‌తివార్ లేఖ రాశారు. (image: Indian Railways)
4. మహారాష్ట్ర విదర్భ పరిధిలోని నాగ్‌పూర్, గోండియా, భండారా, చంద్రాపూర్ జిల్లాలకు హైదరాబాద్‌తో వ్యాపార సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఈ నాగ్‌పూర్-హైదరాబాద్ రూట్లో వందే భారత్ రైలు నడపాలని ఆయన లేఖలో డిమాండ్ చేశారు. నాగ్‌పూర్-హైదరాబాద్ రూట్లో ప్రస్తుతం 22 రైళ్లు నడుస్తున్నా, 575 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తూ సెమీ హైస్పీడ్ రైలు కావాలని ఆయన డిమాండ్ చేశారు. (image: Indian Railways)
5. వ్యాపారులు, వర్తకుల కోసం మాత్రమే కాదు, టూరిస్టులు, ఆంట్రప్రెన్యూర్ కోసం నాగ్‌పూర్ నుంచి హైదరాబాద్ రూట్లో వీలైనంత త్వరగా వందే భారత్ రైలు ప్రారంభించాల్సిన అవసరం ఉందని సుధీర్ ముంగన్‌తివార్ అంటున్నారు. భారతీయ రైల్వే ఈ రూట్లో రైలు నడిపితే విదర్భలోని నాలుగు జిల్లాలకు ఉపయోగపడుతుందన్నారు. (image: Indian Railways)
6. భారతీయ రైల్వే వచ్చే ఏడాది ఆగస్ట్ 15 నాటికి 75 కొత్త వందే భారత్ రైళ్లను నడపాలని భావిస్తోంది. ప్రస్తుతం న్యూ ఢిల్లీ-వారణాసి, న్యూ ఢిల్లీ-శ్రీ మాతా వైష్ణో దేవి కాట్రా, న్యూ ఢిల్లీ-అంబ్ అందౌరా, ముంబై సెంట్రల్-గాంధీ నగర్, మైసూర్-చెన్నై రూట్లలో వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. ఆరో వందే భారత్ రైలు ఏ రూట్లో ప్రారంభం అవుతుందన్న ఆసక్తి నెలకొంది. (image: Indian Railways)
7. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే సికింద్రాబాద్-విశాఖపట్నం రూట్లో, సికింద్రాబాద్-విజయవాడ రూట్లో, సికింద్రాబాద్-విజయవాడ-తిరుపతి రూట్లో వందే భారత్ రైలు అందుబాటులోకి వస్తుందని రకరకాల వార్తలొస్తున్నాయి. భారతీయ రైల్వే పలు రూట్లను పరిశీలిస్తోంది. అయితే ఏ రూట్లో తెలుగు రాష్ట్రాలకు తొలి వందే భారత్ రైలు వస్తుందన్న సస్పెన్స్ నెలకొంది. (image: Indian Railways)