షేర్ మార్కెట్లో ఎన్నో కంపెనీలు ఉంటాయి. అందులో కొన్ని కంపెనీల స్టాక్స్ పైసల్లోనే ఉంటుంది. మరికొన్ని వందల్లో ఉంటాయి. కానీ కొన్ని ప్రముఖ కంపెనీల షేర్లు ఐదంకెల్లో ఉంటాయి. ఆ కంపెనీ స్టాక్స్‌ని సామాన్యలు కొనలేరు. ఒకటి రెండు కొంటేనే మహా గొప్ప. అలాంటి టాప్-5 లగ్జరీ స్టాక్స్ గురించి ఇక్కడ తెలుసుకుందాం. (ప్రతీకాత్మక చిత్రం)
అధిక ధర ఉండే స్టాక్స్‌ని లగ్జరీ స్టాక్స్ అని పిలుస్తారు. ఈ హై రిస్క్ పెన్నీ స్టాక్స్ ఎక్కువగా రిటర్న్స్ ఇస్తాయి. ఇందులో పెట్టుబడి పెట్టుబడిన వారికి దీర్ఘకాలిక లాభాలు ఎక్కువగా వస్తాయి. సాధారణ పెట్టుబడిదారులు వాటిని కొనుగోలు చేయలేరు. ఇలాంటి స్టాక్స్ జాబితాలో MRF, పేజ్ ఇండస్ట్రీస్, హనీవెల్ ఆటోమేషన్, శ్రీసిమెంట్, 3ఎం వంటి కంపెనీలు టాప్‌లో ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
MRFలిమిటెడ్ (MRF Limited): టైర్, రబ్బర్ ఉత్పత్తుల తయారీ సంస్థ మద్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ లిమిటెడ్ (MRF)కంపెనీ స్టాక్.. ఖరీదైన స్టాక్‌ల జాబితాలో మొదటి స్థానానికి చేరుకుంది. ఏప్రిల్ 12న ఈ స్టాక్ ముగింపు ధర రూ.67,800. MRF స్టాక్ 52 వారాల గరిష్ట ధర రూ.87,550. సెప్టెంబర్ 18, 1996న NSEలో లిస్టయిన ఈ కంపెనీ ఇప్పటివరకు 4,000 శాతం రాబడి ఇచ్చింది. ఈ మల్టీనేషనల్ దేశంలోనే అతిపెద్ద టైర్ కంపెనీ . ప్రపంచంలో ఆరవ అతిపెద్దది. దీని ప్రధాన కార్యాలయం చెన్నైలో ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
పేజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (Page Industries): బెంగళూరుకు చెందిన ఈ కంపెనీ ఇన్నర్‌వేర్, లాంజ్‌వేర్, సాక్స్‌ల రిటైల్ వ్యాపారం చేస్తుంది. భారతదేశంతో పాటు శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్, ఖతార్‌లలో జాకీ బ్రాండ్ ఉత్పత్తులను విక్రయిస్తుంది. దీనికి జాకీ ఇంటర్నేషనల్ నుంచి బిజినెస్ లైసెన్స్ ఉంది. ఈ కంపెనీ షేరు ధర మంగళవారం ఎన్ఎస్ఈలో రూ.44,650గా ఉంది. ఈ స్టాక్ ఇప్పటివరకు ఇన్వెస్టర్లకు 16,000 శాతానికి పైగా రాబడిని ఇచ్చింది.(ప్రతీకాత్మక చిత్రం)
హనీవెల్ ఆటోమేషన్ ఇండియా లిమిటెడ్ (Honeywell Automation): షేర్లు హనీవెల్ ఆటోమేషన్ ఇండియా లిమిటెడ్ (HAIL) బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE),నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) రెండింటిలోనూ లిస్ట్ అయింది. పూణేకి చెందిన ఈ కంపెనీ క్యాపిటల్ గూడ్స్ రంగానికి సంబంధించినది.. ఇది ఇంటిగ్రేటెడ్ ఆటోమేషన్, సాఫ్ట్వేర్ సేవలను అందిస్తుంది. మంగళవారం ఎన్ఎస్ఈలో దీని షేరు ధర రూ.39,750. ఇది జూలై 18, 2003న NSEలో లిస్ట్ అయింది. అప్పటి నుంచి ఇది 42,000 శాతానికి పైగా రాబడిని ఇచ్చింది. (ప్రతీకాత్మక చిత్రం)
శ్రీ సిమెంట్ లిమిటెడ్ (Shree Cement): శ్రీ సిమెంట్ ప్రధాన కార్యాలయం కోల్‌కతా. ఇది ఉత్తర భారతదేశంలో అతిపెద్ద సిమెంట్ కంపెనీ. మంగళవారం ఎన్ఎస్ఈలో శ్రీ సిమెంట్ షేరు ధర రూ.25,079గా ఉంది. ఇది BSE, NSE రెండింటిలోనూ లిస్ట్ అయింది. దీని 52 వారాల గరిష్ట ధర రూ.31,538.35. శ్రీ సిమెంట్ ఇప్పటివరకు 82,852 శాతం రాబడిని ఇచ్చింది. ఈ కంపెనీ శ్రీ పవర్, శ్రీ మెగా పవర్ పేర్లతో విద్యుత్తును కూడా ఉత్పత్తి చేసి విక్రయిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3M ఇండియా: 3M ఇండియా లిమిటెడ్ మాతృ సంస్థ 3M యూఎస్. ఇది చాలా వ్యాపారాల్లో ఉంది. అనేక భద్రత. పారిశ్రామిక, రవాణా మరియు ఎలక్ట్రానిక్స్, ఆరోగ్య సంరక్షణ, వినియోగదారు మార్కెట్ల కోసం ఉత్పత్తులను తయారు చేస్తుంది. మంగళవారం ఎన్ఎస్ఇలో 3 ఎం స్టాక్ ముగింపు ధర రూ.21,201. ఇది BSE, NSE రెండింటిలోనూ లిస్ట్ అయింది. దీని 52 వారాల గరిష్ట ధర రూ.27,825.80. ఆగస్టు 13, 2004న లిస్టయిన ఈ కంపెనీ ..ఇప్పటి వరకు పెట్టుబడిదారులకు 8,751.33 శాతం రాబడులను అందించింది. (ప్రతీకాత్మక చిత్రం)
సాధారణ పెట్టుబడిదారులు ఇలాంటి లగ్జరీ స్టాక్‌లలో చాలా తక్కువ డబ్బును మాత్రమే పెట్టుబడి పెడతారు. ఒకటి లేదా రెండు షేర్లను కొనుగోలు చేస్తారు. వాటి నుంచే లాభాలు పొందుతారు. చిన్న ఇన్వెస్టర్లు ఏ రోజుకా రోజు ఇంట్రాడే ట్రేడింగ్ జరిపి స్వల్ప మొత్తంలో లాభాలు సంపదిస్తారు. ఇక బడా ఇన్వెస్టర్లు మాత్రం దీర్ఘకాలిక లాభాలు పొందుతారు. (ప్రతీకాత్మక చిత్రం)
(Disclaimer:షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం రిస్క్‌తో కూడుకున్నది. పైన పేర్కొన్న స్టాక్‌లు బ్రోకరేజ్ హౌస్‌ల సలహాపై ఆధారపడి ఉంటాయి. మీరు వీటిలో దేనిలోనైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే, ముందుగా సర్టిఫైడ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్‌ను సంప్రదించండి. మీకు కలిగే లాభం లేదా నష్టానికి News18 ఎలాంటి బాధ్యత వహించదు. ) (ప్రతీకాత్మక చిత్రం)