ఒకేసారి ఏకమొత్తంలో పెన్షన్ (Pension) విత్‌డ్రా చేసుకునే అంశంలో కేంద్ర ప్రభుత్వం (Central Government) స్పష్టత ఇచ్చింది. ఉద్యోగుల నుంచి సూచనలు, ప్రశ్నలు స్వీకరించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. బేసిక్ పెన్షన్‌లో కొంత శాతాన్ని ఏకమొత్తంగా విత్‌డ్రా చేసుకొనే ఆప్షన్ సెలక్ట్ చేసుకున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండు లేదా తదుపరి సందర్భంలో అలా చేసే అవకాశం ఉండదు. ఈ విషయాన్ని ఇప్పటికే పెన్షన్, పెన్షనర్స్ వెల్ఫేర్(DoPPW) స్పష్టం చేసింది.
CCS (కమ్యుటేషన్ ఆఫ్ పెన్షన్) రూల్స్ 1981లోని రూల్ 5 ప్రకారం.. ఒక ప్రభుత్వ ఉద్యోగి బేసిక్ పెన్షన్‌లో 40 శాతం వరకు ఏకమొత్తం చెల్లింపుగా కమ్యూట్ చేయవచ్చు లేదా విత్‌డ్రా చేసుకోవచ్చు. రెండవసారి పెన్షన్‌లో కొంత భాగాన్ని ఏకమొత్తంగా విత్‌డ్రా చేసుకోవడం గురించి రిఫరెన్స్‌లు, రిప్రజెంటేషన్లు స్వీకరించిన తర్వాత DoPPW స్పష్టత ఇచ్చింది.
వ్యత్యాసం ఉన్న మొత్తాన్ని ఇప్పటికే ఆథరైజ్ చేసిన విలువ, పెన్షన్ పెరుగుదలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత నిర్ణయించిన విలువ మధ్య ఉన్న తేడా ఆధారంగా లెక్కిస్తారు. అయితే, ఆ వ్యక్తి వాస్తవానికి బేసిక్ పెన్షన్‌లో 40 శాతం కంటే తక్కువ శాతాన్ని తీసుకున్నప్పుడు రెండోసారి పరిమితిలోపు పెన్షన్‌లో కొంత భాగాన్ని విత్‌డ్రా చేసుకోవడం లేదా కమ్యూట్ చేయడం కోసం 1981 నియమం ప్రకారం ఎటువంటి నిబంధన లేదు.