ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారం.. ప్రజలకు ఎల్టీసీజీపై ట్యాక్స్ ఆదా చేసుకోవడానికి ఒక ఆప్షన్ ఉంది. పొందిన లాంగ్ టర్మ్ గెయిన్స్‌ను తిరిగి సెక్షన్ 54, సెక్షన్ 54బీ కింద సంబంధిత ఇన్స్ట్రుమెంట్లలో ఇన్వెస్ట్ చేయొచ్చు. తద్వారా పన్ను ఆదా చేసుకోవచ్చు. ఐటీఆర్ ఫైలింగ్ వెబ్సైట్లో ఈ గడువు పొడిగింపు వల్ల ఎలాంటి ప్రయోజనం పొందొచ్చొ వివరంగా తెలియజేసిందని ట్యాక్స్2విన్ సీఈవో అభిషేక్ సోని తెలిపారు.