2021 ఫిబ్రవరి నెలలో గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది. రూ.100 మేర పైకి కదిలింది. మూడు సార్లు ఈ పెంపు నమోదు చేసింది. ఒకసారి రూ. 50, మరోసారి రూ.25, మరోసారి రూ.25 ఇలా మొత్తంగా మూడు సార్లు రూ.100 మేర సిలిండర్ రేటు పెరిగింది. అయితే ఈసారి మాత్రం అలాంటిది ఏమీ లేదు. ఎల్పీజీ సిలిండర్ ధరలు నేడు స్థిరంగానే కొనసాగాయని చెప్పుకోవచ్చు.
అదే సమయంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర మాత్రం గత ఏడాదిలో రూ. 357 మేర దిగి వచ్చింది. అంటే 14.2 కేజీల సిలిండర్ ధర పెరిగితే.. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర మాత్రం తగ్గిందని అర్థం చేసుకోవాలి. అంటే సామాన్యులపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడిందని చెప్పుకోవచ్చు. అదే సమయంలో వ్యాపారులకు మాత్రం ఊరట లభించిందని అనుకోవాలి. ఇకపోతే ఈ ఏడాది ఎల్పీజీ రేట్లు ఎలా కదులుతాయో చూడాల్సి ఉంది.