LPG GAS SUBSIDY NOT CREDITED IN YOUR BANK ACCOUNT CHECK STATUS WITH THESE STEPS SS
LPG Subsidy: గ్యాస్ సిలిండర్ సబ్సిడీ రాలేదా? ఎలా చెక్ చేయాలంటే
LPG Gas subsidy status check | మీ గ్యాస్ సిలిండర్ సబ్సిడీ వచ్చిందా? మీరు గ్యాస్ సిలిండర్ తీసుకున్న ప్రతీసారి సబ్సిడీ మీ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవుతుందా? ఎలా చెక్ చేయాలో తెలుసుకోండి.
1. ఎల్పీజీ సిలిండర్లపై కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఏడాదిలో 12 సిలిండర్లకు సబ్సిడీ పొందొచ్చు. అయితే సిలిండర్ కొనేప్పుడు పూర్తి ధర చెల్లించాలి. ఆ తర్వాత ప్రభుత్వం కస్టమర్ ఖాతాలో సబ్సిడీ డబ్బుల్ని క్రెడిట్ చేస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 10
2. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ ద్వారా ఈ డబ్బుల్ని బదిలీ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. 2015 లో ఈ స్కీమ్ ప్రారంభమైంది. ఎల్పీజీ కస్టమర్ల బ్యాంకు అకౌంట్లోకి సబ్సిడీ డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేసే స్కీమ్ ఇది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 10
3. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలను బట్టి ఎల్పీజీ సిలిండర్ల ధరలు మారుతుంటాయి. ప్రతీ నెలా ఎల్పీజీ సిలిండర్ ధరల్ని సవరిస్తుంటాయి ఆయిల్ కంపెనీలు. అందుకే సిలిండర్ ధరల్లో హెచ్చుతగ్గులుంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 10
4. ఇక సబ్సిడీ విషయానికి వస్తే కస్టమర్ సిలిండర్ తీసుకున్న కొద్దిరోజుల్లోనే సబ్సిడీ బ్యాంకు అకౌంట్లో జమ అవుతుంది. మీకు వరుసగా రెండు నెలలు సబ్సిడీ డబ్బులు రాకపోతే ఎల్పీజీ సబ్సిడీ స్టేటస్ తెలుసుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 10
5. ఐఓసీఎల్, హెచ్‌పీ, బీపీసీఎల్ కంపెనీల నుంచి మీరు సిలిండర్లు కొనుగోలు చేస్తున్నా ఎల్పీజీ సబ్సిడీ స్టేటస్ తెలుసుకోవడానికి వేర్వేరు వెబ్‌సైట్స్ చూడాల్సిన అవసరం లేదు. http://mylpg.in/ వెబ్సైట్లో మీ సబ్సిడీ స్టేటస్ తెలుసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 10
6. ఐఓసీఎల్, హెచ్‌పీ, బీపీసీఎల్ కంపెనీలకు సంబంధించిన వివరాలన్నీ ఈ వెబ్సైట్లో ఉంటాయి. మరి మీకు సబ్సిడీ రాకపోతే స్టేటస్ చెక్ చేసుకునేందుకు ఈ స్టెప్స్ ఫాలో అవండి. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 10
7. ముందుగా http://mylpg.in/ వెబ్సైట్ ఓపెన్ చేయండి. హోమ్ పేజీలోనే మీ 17 అంకెల ఎల్పీజీ ఐడీని ఎంటర్ చేయండి. ఎల్పీజీ ఐడీ మీ ఎల్పీజీ పాస్ బుక్ పైన ఉంటుంది. ఒకవేళ మీ ఎల్పీజీ ఐడీ తెలియకపోతే click here to know your LPG ID పైన క్లిక్ చేయండి. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 10
8. ఆ తర్వాత మీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ పేరు సెలెక్ట్ చేయండి. ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ ఎల్పీజీ ఐడీ తెలుస్తుంది. ఆ తర్వాత మీ ఎల్పీజీ ఐడీని ఎంటర్ చేయండి. (ప్రతీకాత్మక చిత్రం)
9/ 10
9. సబ్మిట్ చేసిన తర్వాత కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. మీ ఇమెయిల్ ఐడీ, పాస్‌వర్డ్‌తో రిజిస్టర్ చేసుకొండి. మీ ఇమెయిల్ ఐడీకి యాక్టివేషన్ లింక్ వస్తుంది. ఆ లింక్ క్లిక్ చేస్తే అకౌంట్ క్రియేట్ అవుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
10/ 10
10. ఈ వివరాలతో లాగిన్ చేస్తే మీ ఎల్పీజీ అకౌంట్‌కు బ్యాంక్ అకౌంట్, ఆధార్ నెంబర్ లింక్ అయ్యాయో లేదో తెలుస్తుంది. అందులోనే మీ సబ్సిడీ ట్రాన్స్ఫర్ అయిందో లేదో స్టేటస్ తెలుసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)