1. Credit Card: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొద్ది రోజుల క్రితం క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్ ఇష్యూయెన్స్ అండ్ కండక్ట్ డైరెక్షన్స్ 2022 పేరుతో రూల్స్ ప్రకటించింది. ఈ రూల్స్ నేటి నుంచి అమలులోకి వచ్చాయి. క్రెడిట్ కార్డ్ అకౌంట్ క్లోజ్ చేసే విషయంలో బ్యాంకులు కస్టమర్ల రిక్వెస్ట్‌ను వీలైనంత త్వరగా అంగీకరించాల్సి ఉంటుంది. ఏడు వర్కింగ్ డేస్‌లో ఆ రిక్వెస్ట్‌ను బ్యాంకులు పరిగణలోకి తీసుకొని ఇమెయిల్, ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం ఇవ్వాలి. ఆలస్యమైతే ప్రతీ రోజుకు రూ.500 చొప్పున జరిమానా చెల్లించాలి. (ప్రతీకాత్మక చిత్రం)
2. PAN Card: పాన్ కార్డ్ ఉన్నవారు తప్పనిసరిగా తమ ఆధార్ నెంబర్ లింక్ చేయాలి. గడువు 2022 మార్చి 31న ముగిసింది. ఏప్రిల్ 1 నుంచి జూన్ 30 వరకు పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ లింక్ చేస్తే రూ.500 జరిమానా వసూలు చేసింది ఆదాయపు పన్ను శాఖ. జూలై 1 నుంచి పాన్, ఆధార్ లింక్ చేస్తే రూ.1,000 జరిమానా చెల్లించాలి. (ప్రతీకాత్మక చిత్రం)
3. Cryptocurrency: జూలై 1 నుంచి అన్ని క్రిప్టో లావాదేవీలపై పన్నులు వర్తిస్తాయి. కేంద్ర ప్రభుత్వం 1 శాతం టీడీఎస్ వసూలు చేస్తోంది. క్రిప్టో ట్రేడింగ్‌లో నష్టపోయినా పన్నులు వర్తిస్తాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం క్రిప్టో ఆదాయంపై క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ విధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు 1 శాతం టీడీఎస్ అమలులోకి వచ్చింది. (ప్రతీకాత్మక చిత్రం)
5. LPG Prices: ఆయిల్ కంపెనీలు ప్రతీ నెలా ఒకటో తేదీన గ్యాస్ సిలిండర్ల ధరల్ని సవరిస్తుంటాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరల్ని పరిగణలోకి తీసుకొని ధరల్ని సవరిస్తాయి. కమర్షియల్ సిలిండర్ ధరను రూ.198 తగ్గించాయి ఆయిల్ కంపెనీలు. ఇళ్లల్లో ఉపయోగించే డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. (ప్రతీకాత్మక చిత్రం)
7. TDS Rules: డాక్టర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, ఇతరులు ఎవరైనా ఉచిత బహుమతులు, ఇతర ప్రయోజనాలు పొందితే 10 శాతం టీడీఎస్ చెల్లించాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఆదేశిస్తోంది. ఆదాయపు పన్ను చట్టంలోని 194ఆర్ సెక్షన్ ప్రకారం 10 శాతం టీడీఎస్ చెల్లించాలి. ఈ రూల్ అమలులోకి వచ్చింది. (ప్రతీకాత్మక చిత్రం)