1. SBI ATM New Charges: జూలై 1 నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI కొత్త ఛార్జీలను అమలు చేయనుంది. బేసిక్ సేవింగ్స్ అకౌంట్ హోల్డర్లకు ఈ కొత్త రూల్స్ వర్తిస్తాయి. బ్యాంక్ బ్రాంచ్లో, ఏటీఎంలో నాలుగు సార్లు ఉచితంగా డబ్బులు డ్రా చేయడం ఉచితమే. ఆ తర్వాత జరిపే ప్రతీ లావాదేవీకి జూలై 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీ వర్తిస్తుంది. రూ.15+జీఎస్టీ చెల్లించాలి. (ప్రతీకాత్మక చిత్రం)
2. SBI Cheque Book Charges: ఎస్బీఐ బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్-BSBD అకౌంట్ ఉన్నవారు ఒక ఆర్థిక సంవత్సరంలో 10 చెక్ లీవ్స్ చెక్ బుక్ ఉచితంగా పొందొచ్చు. మరో 10 చెక్స్ ఉన్న బుక్ కోసం రూ.40+జీఎస్టీ, 25 చెక్స్ ఉన్న బుక్ కోసం రూ.75+జీఎస్టీ చెల్లించాలి. 10 చెక్స్తో ఎమర్జెన్సీ చెక్ బుక్ కావాలంటే రూ.50+జీఎస్టీ చెల్లించాలి. (ప్రతీకాత్మక చిత్రం)