SBI Credit Card: ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఉపయోగిస్తున్నవారికి డిసెంబర్ 1 నుంచి షాక్ తప్పదు. ఈఎంఐ ద్వారా జరిపే కొనుగోళ్లకు అదనపు ఛార్జీ చెల్లించాలి. ఈఎంఐ కొనుగోళ్లపై రూ.99 + ట్యాక్సులు చెల్లించాలని ఎస్బీఐ ప్రకటించింది. అంటే ఆన్లైన్ షాపింగ్‌తో పాటు మర్చంట్స్ దగ్గర ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ చేస్తే ఈ ఛార్జీలు వర్తిస్తాయి. ఈ ఛార్జీలు 2021 డిసెంబర్ 1 నుంచే అమలులోకి రానున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
Match Box: అగ్గిపెట్ట ధర పెరగబోతోంది. 14 ఏళ్ల తర్వాత అగ్గిపెట్ట రేటు పెరగడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం ఒక్క రూపాయి ఉన్న అగ్గిపెట్టె కొనడానికి ఇకపై రెండు రూపాయలు చెల్లించాలి. అయితే ఒక్క రూపాయి అగ్గిపెట్టెలో 36 స్టిక్స్ ఉంటే, రెండు రూపాయల అగ్గిపెట్టెలో 50 స్టిక్స్ ఉండనున్నాయి. డిసెంబర్ 1 నుంచే కొత్త ధరలు అమలులోకి రానున్నాయి. ముడిసరుకు, తయారీ ఖర్చు పెరగడమే అగ్గిపెట్టె ధర పెరగడానికి కారణం. (ప్రతీకాత్మక చిత్రం)
Punjab National Bank: పంజాబ్ నేషనల్ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేట్లను తగ్గించింది. ప్రస్తుతం 2.90 వార్షిక వడ్డీ ఇస్తోంది పంజాబ్ నేషనల్ బ్యాంక్. 2021 డిసెంబర్ 1 నుంచి 2.80 శాతం వడ్డీ వర్తిస్తుంది. సేవింగ్స్ అకౌంట్లో రూ.10,00,000 లోపు ఉన్నవారికి 2.80 శాతం వడ్డీ, రూ.10,00,000 కన్నా ఎక్కువ ఉంటే 2.85 శాతం వడ్డీ లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
EPF Aadhaar Linking: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) అకౌంట్ ఉన్నవారంతా తప్పనిసరిగా యూనివర్సల్ అకౌంట్ నెంబర్‌కు (UAN) ఆధార్ నెంబర్‌ను లింక్ చేయాలి. గతంలో 2021 సెప్టెంబర్ 1 లోగా ఉన్న గడువును 2021 నవంబర్ 30 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. అప్పట్లోగా యూఏఎన్‌ను ఆధార్ నెంబర్‌తో లింక్ చేయాల్సిందే. లేకపోతే ఈపీఎఫ్ అకౌంట్లో యజమాని వాటా జమ కాదు. (ప్రతీకాత్మక చిత్రం)
Amazon Prime Membership: అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) మెంబర్షిప్ తీసుకోవాలంటే ఇకపై కాస్త ఎక్కువ ఖర్చు చేయాలి.
ప్రైమ్ మెంబర్షిప్ ధరల్ని ఏకంగా 50 శాతం పెంచింది కంపెనీ. కొత్త ధరలు డిసెంబర్ 14 నుంచి అమలులోకి వస్తాయి. డిసెంబర్ 14 నుంచి యాన్యువల్ సబ్‌స్క్రిప్షన్‌కు రూ.1,499, మంత్లీ ప్లాన్‌కు రూ.179, క్వార్టర్లీ ప్లాన్‌కు రూ.459 చెల్లించాలి. (ప్రతీకాత్మక చిత్రం)
LPG Gas Cylinder Price: ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కమర్షియల్ సిలిండర్ ధరను రూ.103.5 పెంచాయి. పెరిగిన ధరలు అమలులోకి వచ్చాయి. హైదరాబాద్‌లో ప్రస్తుతం కమర్షియల్ సిలిండర్ ధర రూ.2278 కి చేరుకుంది. గత నెలలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.265 పెరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో రూ.103.50 పెరిగింది. (ప్రతీకాత్మక చిత్రం)
Saudi Arabia: భారతదేశంతో పాటు మరో ఐదు దేశాలపై ట్రావెల్ బ్యాన్‌ను తొలగించింది సౌదీ అరేబియా. డిసెంబర్ 1 నుంచి ఇది అమలులోకి వస్తుంది. ఆయా దేశాలకు చెందినవారు పూర్తిగా వ్యాక్సిన్ తీసుకున్నట్టైతే డిసెంబర్ 1 నుంచి సౌదీ అరేబియాకు వెళ్లొచ్చు. 14 రోజుల క్వారెంటైన్ నిబంధనను కూడా తొలగించింది సౌదీ అరేబియా. (ప్రతీకాత్మక చిత్రం)
Special Trains: ఈస్ట్ కోస్ట్ రైల్వే విశాఖపట్నం సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. డిసెంబర్ 1 నుంచి 29 వరకు ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయి. వీక్లీ పూజ స్పెషల్ ట్రైన్ పేరుతో వీటిని ప్రకటించింది ఈస్ట్ కోస్ట్ రైల్వే. ఈ రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, విజయవాడ, గుంటూరు, మిర్యాలగూడ, సత్తెనపల్లి స్టేషన్లలో ఆగుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)
Pension Alert: నవంబర్ 30 లోగా లైఫ్ సర్టిఫికెట్ సమర్పించని పెన్షనర్లకు డిసెంబర్ నుంచి పెన్షన్ రాదు. రిటైర్ అయిన ఉద్యోగులు అంతరాయం లేకుండా పెన్షన్ పొందాలంటే ఏటా నవంబర్ 1 నుంచి నవంబర్ 30 మధ్య బ్యాంకులకు లైఫ్ సర్టిఫికెట్ సబ్మిట్ చేసుకోవచ్చు. పెన్షనర్ ఇంకా బతికే ఉన్నాడని సర్టిఫికేట్ రుజువుగా పనిచేస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
Reliance Jio: రిలయన్స్ జియో ప్రీపెయిడ్ ప్లాన్స్ ధరలు పెరిగాయి. అన్ని ప్లాన్స్‌పై 20 శాతం వరకు ధరలు పెరిగినట్టు జియో ప్రకటించింది. కొత్త ప్లాన్స్ 2021 డిసెంబర్ 1న అమలులోకి రానున్నాయి. ఇక ఇప్పటికే ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా ప్లాన్స్ ధరలు పెంచిన సంగతి తెలిసిందే. ఈ ప్లాన్స్ అమలులోకి వచ్చాయి. (ప్రతీకాత్మక చిత్రం)