ఐతే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధరల్లో ప్రస్తుతం కంపెనీలు ఎలాంటి మార్పు చేయలేదు. గృహ వినియోగ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలు అక్టోబర్ 6, 2021 తర్వాత స్థిరంగా ఉంటాయి. ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో వచ్చే వారం నుంచి డొమెస్టిక్ సిలిండర్ ధరలు కూడా పెరిగే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
ప్రస్తుతం ఎల్పీజీ ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్లో రూ.952, ఢిల్లీ రూ. 899.50, బీహార్ రూ. 979.50గా ఉంది. ఇక ముంబై రూ. 899.50, మధ్యప్రదేశ్ రూ. 905.50, రాజస్థాన్ రూ. 903.50, పంజాబ్లో రూ.933.00, ఉత్తరప్రదేశ్ రూ. 897.50, ఉత్తరాఖండ్ రూ.918.50, ఝార్ఖండ్లో రూ.957, ఛత్తీస్గఢ్లో రూ.971 వద్ద స్థిరంగా ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)