1. మీరు ఎక్కువగా లావాదేవీలు జరుపుతుంటారా? బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ చేస్తుంటారా? అయితే అలర్ట్. 2021 ఆగస్ట్ 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. ఈ రూల్స్ సామాన్యులను ఎక్కువగా ప్రభావితం చేసేవే. ఏటీఎం లావాదేవీలు, ఎల్పీజీ ధరలు, వేతనాలు, పెన్షన్లు ఇలా చాలా అంశాలకు సంబంధించి కొత్త రూల్స్ అమల్లోకి వస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2. Salary, Pension, EMI: మీకు ప్రతీ నెల ఒకటో తేదీన జీతం అకౌంట్లో పడుతుందా? ఒక్కోసారి ఒకటో తేదీ ఆదివారం వస్తే సాలరీ రావడం ఆలస్యం అవుతుంది. కానీ ఇకపై ఇలాంటి సమస్యే ఉండదు. సెలవు రోజుల్లో కూడా ఖాతాదారుల అకౌంట్లలో వేతనాలు, పెన్షన్లు జమ చేసేలే నేషనల్ ఆటోమెటెడ్ క్లియరెన్స్ హౌజ్-NACH మార్పులు చేసింది. 2021 ఆగస్ట్ 1 నుంచి ఈ రూల్స్ అమల్లోకి రానున్నాయి. ఆగస్ట్ 1 ఆదివారం రోజు కూడా వేతనాలు, పెన్షన్లు, డివిడెండ్, వడ్డీ క్రెడిట్ అవుతాయి. అంతేకాదు... మీరు చెల్లించాల్సిన ఈఎంఐ, మ్యూచువల్ ఫండ్ సిప్, లోన్ పేమెంట్ లాంటి వాటికీ ఈ రూల్ వర్తిస్తుంది. అంటే సెలవు రోజుల్లో కూడా పేమెంట్స్ జరిగిపోతాయి. (ప్రతీకాత్మక చిత్రం)
3. ATM Cash Withdrawal: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI ఇటీవల ఏటీఎం ఇంటర్‌ఛేంజ్ ఫీజును పెంచిన సంగతి తెలిసిందే. ఆగస్ట్ 1 నుంచి ఏటీఎంలో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్‌కు ఇంటర్‌ఛేంజ్ ఫీజు రూ.17 చెల్లించాలి. నాన్ ఫైనన్షియల్ ట్రాన్సాక్షన్‌కు రూ.6 చెల్లించాలి. ప్రస్తుతం ఇంటర్‌ఛేంజ్ ఫీజు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్‌కు రూ.15, నాన్ ఫైనన్షియల్ ట్రాన్సాక్షన్‌కు రూ.5 ఉన్న సంగతి తెలిసిందే. (ప్రతీకాత్మక చిత్రం)
6. ICICI Bank: ఐసీఐసీఐ బ్యాంక్ పలు ఛార్జీలను సవరించింది. క్యాష్ ట్రాన్సాక్షన్స్‌పై లిమిట్, ఏటీఎం ఇంటర్‌ఛేంజ్, చెక్ బుక్ లాంటి అంశాల్లో 2021 ఆగస్ట్ 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి వస్తున్నాయి. రెగ్యులర్ సేవింగ్స్ అకౌంట్ ఉన్నవారికి నాలుగు ట్రాన్సాక్షన్స్ ఉచితం. ఆ తర్వాత జరిపే లావాదేవీలకు రూ.150 ఛార్జీలు చెల్లించాలి. ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లకు హోమ్ బ్రాంచ్‌లో ప్రతీ రోజు రూ.1,00,000 వరకు లావాదేవీలు ఉచితం. రూ.1,00,000 దాటితే ప్రతీ రూ.1,000 కి రూ.5 ఛార్జీ చెల్లించాలి. కనీసం రూ.150 ఛార్జీ చెల్లించాలి. నాన్ హోమ్ బ్రాంచ్‌లో ప్రతీ రోజు రూ.25,000 వరకు లావాదేవీలు ఉచితం. రూ.25,000 దాటితే ప్రతీ రూ.1,000 కి రూ.5 ఛార్జీ చెల్లించాలి. థర్డ్ పార్టీ లావాదేవీలు రూ.25,000 వరకు ఉచితం. ఆ తర్వాత ప్రతీ లావాదేవీకి రూ.150 చెల్లించాలి. ఇక ఒక ఏడాదిలో 25 లీవ్స్ ఉన్న చెక్ బుక్ ఉచితం. ఆ తర్వాత 10 లీవ్స్ ఉన్న చెక్ బుక్కు రూ.20 చెల్లించాలి. (ప్రతీకాత్మక చిత్రం)