3. Punjab National Bank ATM Card: పంజాబ్ నేషనల్ బ్యాంక్ కస్టమర్లు డెబిట్ కార్డుతో డబ్బులు విత్‌డ్రా చేయాలంటే ఓటీపీ తప్పనిసరి కానుంది. కస్టమర్లు కార్డును ఏటీఎం మెషీన్లో పెట్టి, పిన్ ఎంటర్ చేసిన తర్వాత రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన డబ్బులు డ్రా చేయాలి. రూ.10,000 కన్నా ఎక్కువ డ్రా చేయడానికి ఓటీపీ తప్పనిసరి. (ప్రతీకాత్మక చిత్రం)
5. PNB KYC Rule: పంజాబ్ నేషనల్ బ్యాంకులో అకౌంట్ ఉన్న కస్టమర్లు డిసెంబర్ 12 లోగా కేవైసీ అప్డేట్ చేయాలి. కేవైసీ అప్డేట్ చేయకపోతే వారి అకౌంట్‌ను బ్లాక్ చేస్తామని పంజాబ్ నేషనల్ బ్యాంక్ హెచ్చరించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిబంధనల ప్రకారం కస్టమర్లు కేవైసీ అప్డేట్ చేయించడం తప్పనిసరి. (ప్రతీకాత్మక చిత్రం)
6. IPPB: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ ఉన్నవారికి డిసెంబర్ 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు అమలులోకి రానున్నాయి. ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్స్ సిస్టమ్ (AePS) సర్వీస్ ఛార్జీలను ప్రకటించింది ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్. క్యాష్ విత్‌డ్రాయల్ కోసం రూ.20 + జీఎస్టీ, క్యాష్ డిపాజిట్ కోసం రూ.20 + జీఎస్టీ, మినీ స్టేట్మెంట్ కోసం రూ.5+ జీఎస్టీ చెల్లించాలి. (ప్రతీకాత్మక చిత్రం)