దేశరాజధాని ఢిల్లీలో 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ.102.5 పెరిగింది. మే 1 నుంచి ఢిల్లీలో 19 కేజీల సిలిండర్ కొనాలంటే రూ.2355.5 వెచ్చించాల్సి ఉంటుంది. ముంబైలో రూ.2205కి బదులు రూ.2329.50 చెల్లించాలి. కోల్కతాలో రూ.2351కి బదులు 2477.50 ఖర్చు చేయాలి. చెన్నైలో కమర్షియల్ సిలిండర్ ధర రూ. 2406 నుంచి రూ.2508కి పెరిగింది. (ప్రతీకాత్మక చిత్రం)
గత నెలలో కూడా ఎల్పీజీ సిలిండర్ రేట్లు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 1న 19 కేజీల సిలిండర్ ధర ఒకేసారి రూ.250 పెరిగింది. తాజాగా రూ. 104 పెంచారు. ఇప్పటికే పెట్రోల్, డీజిల్, వంట నూనె ధరలు భారీగా పెరిగాయి. దీనికి తోడు ఎల్పీజీ రేట్లు ఎగబాకుతుండడంతో.. హోటల్, బేకరీ, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు నిర్వహించే చిరు వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
కమర్షియల్ సిలిండర్ ధర పెరగడం వల్ల.. అది సామాన్య ప్రజలపై కూడా ప్రభావం చూపుతుంది. స్వీట్ షాప్, బేకరీ, టీ స్టాల్, హోటళ్లు, రెస్టారెంట్లు ఆహార ఉత్పత్తుల రేట్లను పెంచే అవకాశముంది. తద్వారా సామాన్యుడిపై అదనపు భారం పడుతుంది. వంటనూనె, ఎల్పీజీ ధరలు పెరగడంతో చాలా హోటళ్లు, బేకరీలు ధరలను ఇప్పటికే పెంచాయి. (ప్రతీకాత్మక చిత్రం)