1. Cheque Book: ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (OBC), యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (UBI) పాత చెక్ బుక్స్ 2021 అక్టోబర్ 1 నుంచి పనిచేయవు. ఈ విషయంపై పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కొంతకాలంగా కస్టమర్లను అప్రమత్తం చేస్తోంది. eOBC, eUNI పాత చెక్ బుక్స్ పనిచేయవని, పంజాబ్ నేషనల్ బ్యాంక్ చెక్ బుక్స్ తీసుకోవాలని కోరుతోంది. ఇక అలహాబాద్ బ్యాంక్ చెక్ బుక్స్ కూడా పనిచేయవని ఇండియన్ బ్యాంక్ వెల్లడించింది. (ప్రతీకాత్మక చిత్రం)
2. Auto Debit: మీరు ఆటోమేటెడ్ పేమెంట్స్ కోసం మీ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డుల్ని ఉపయోగిస్తున్నారా? అంటే అమెజాన్ ప్రైమ్, డిస్నీప్లస్ హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్స్ కోసం మీ కార్డు వివరాలు ఇచ్చారా? అక్టోబర్ 1 నుంచి ఆటోడెబిట్ ఆప్షన్ పనిచేయదు. అడిషనల్ ఫ్యాక్టర్ ఆఫ్ ఆథెంటికేషన్ (AFA) జోడించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI. మీకు ముందుగానే సమాచారం అందుతుంది. మీరు అనుమతిస్తేనే ట్రాన్సాక్షన్ జరుగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. ATM New Rule: ఏటీఎంలో డ్రా చేయడానికి వెళ్తే డబ్బులు లేవా? అయితే బ్యాంకులు మీకు రూ.10,000 ఫైన్ చెల్లిస్తాయి. ఏటీఎంలో డబ్బుల విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI కొత్త రూల్స్ అమలు చేయనుంది. ఒక ఏటీఎంలో నెలలో 10 గంటల పైన నగదు లేనట్టైతే బ్యాంకు రూ.10,000 చొప్పున పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ రూల్స్ అక్టోబర్‌లో అమలులోకి వచ్చే అవకాశం ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. Pension Rule: పెన్షనర్లకు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ రూల్స్ మారుతున్నాయి. 80 ఏళ్ల వయస్సుదాటిన వారు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్‌ను అన్ని హెడ్ పోస్ట్ ఆఫీసుల్లోని జీవన్ ప్రమాణ్ సెంటర్లో సమర్పించాల్సి ఉంటుంది. 2021 అక్టోబర్ 1 నుంచి నవంబర్ 30 వరకు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ ఇవ్వొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
5. Investments: అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు అంటే మ్యూచువల్ ఫండ్ హౌజ్లల్లో పనిచేసే జూనియర్ స్థాయి ఉద్యోగులు తమ గ్రాస్ సాలరీలో 10 శాతాన్ని మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఈ కొత్త రూల్స్ ప్రకటించింది. అక్టోబర్ 1న ఈ రూల్స్ అమల్లోకి వస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
6. LPG Prices: ప్రతీ నెల ఒకటో తేదీన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరల్ని సవరిస్తుంటాయి ఆయిల్ కంపెనీలు. సెప్టెంబర్ 1న డొమెస్టిక్, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరల్ని పెంచిన ఆయిల్ కంపెనీలు... అక్టోబర్ 1న కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరల్ని మాత్రమే పెంచాయి. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలు పెరగలేదు. (ప్రతీకాత్మక చిత్రం)
7. Demat Account: అక్టోబర్ 1 నుంచి కొత్తగా ట్రేడింగ్, డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసే ఇన్వెస్టర్లు నామినేషన్ వివరాలు వెల్లడించడం లేదా వెల్లడించకపోవడం అనే ఛాయిస్‌ను ఇస్తోంది సెక్యూరిటీ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా-SEBI. ఇక ఇప్పటికే ఈ అకౌంట్స్ ఉన్నవారు 2022 మార్చి 31 లోగా నామినేషన్ వివరాలు వెల్లడించాలి. లేకపోతే వారి డీమ్యాట్ అకౌంట్స్ ఫ్రీజ్ అవుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)