Gas Cylinder: గ్యాస్ సిలిండర్ వాడే వారికి గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఆఫర్లు!
Gas Cylinder: గ్యాస్ సిలిండర్ వాడే వారికి గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఆఫర్లు!
LPG Cylinder | గ్యాస్ సిలిండర్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంది. ఎందుకంటే పొదున లేస్తూనే సిలిండర్ స్టవ్ వెలిగించకపోతే రోజాంతా గడువదు. ఎందుకంటే ఆహారం వండుకోవాలి కదా. అందుకే ప్రతి ఒక్కరి ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉండాల్సిందే. ఎల్పీజీ సిలిండర్ అయిపోయిన తర్వాత చాలా మంది మళ్లీ బుక్ చేస్తారు. ఇలా గ్యాస్ బుకింగ్‌పై ఆఫర్లు పొందొచ్చు.
గ్యాస్ సిలిండర్ బుక్ చేయడానికి ఒక్కొక్కరు ఒక్కో ఆప్షన్ ఎంచుకోవచ్చు. అంటే కొంత మంది ఫోన్ కాల్ ద్వారా బుక్ చేయొచ్చు. ఇంకొంత మంది వారిస ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ యాప్ ద్వారా సిలిండర్ బుక్ చేస్తుంటారు.
2/ 8
అలాగే మరి కొంత మంది పేటీఎం, గూగుల్ పే వంటి తదితర యాప్స్ ద్వారా సిలిండర్‌ను బుక్ చేస్తూ ఉంటారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా సిలిండర్ బుక్ చేస్తుంటారు. ఈ క్రమంలో ఒక్క కంపెనీ ఒక్కో రకమైన ఆఫర్‌ను అందుబాటులో ఉంచొచ్చు.
3/ 8
మనం ఇప్పుడు బజాజ్ ఫిన్సర్వ్ ఆఫర్ గురించి మాట్లాడుకుంటున్నాం. బజాజ్ ఫిన్సర్వ్ కూడా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ బుకింగ్‌పై ఆకర్షణీయ ఆఫర్‌ను అందుబాటులో ఉంచింది. ఈ ఆఫర్ ఎలా పొందాలో తెలుసుకుందాం.
4/ 8
మీరు బజాజ్ ఫిన్సర్వ్ యాప్ ద్వారా గ్యాస్ సిలిండర్ ఆన్లైన్లో బుక్ చేస్తే రూ. 70 వరకు క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. అయితే బజాజ్ పే యూపీఐ ద్వారా గ్యాస్ సిలిండర్ డబ్బులు చెల్లిస్తేనే ఈ ఆఫర్ వర్తిస్తుందని గుర్తించుకోవాలి.
5/ 8
కేవలం గ్యాస్ సిలిండర్ బుకింగ్‌పై మాత్రమే కాకుండా కరెంటు బిల్లు, మొబైల్ రీచార్జ్, డీటీహెచ్ రీచార్జ్ వంటి వాటిపై కూడా ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. వీటన్నింటిపై మొత్తంగా రూ. 230 వరకు క్యాష్‌బ్యాక్ వస్తుంది.
6/ 8
బజాజ్ పే యూపీఐ ద్వారా మొబైల్ రీచార్జ్ చేసుకుంటే రూ. 45 వరకు క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. అదే ఎలక్ట్రిసిటీ బిల్లు చెల్లిస్తే.. రూ. 70 వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుందని చెప్పుకోవచ్చు.
7/ 8
డీటీహెచ్ డీచార్జ్ విషయానికి వస్తే.. రూ. 45 వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. మీరు బజాజ్ పే యూపీఐ ద్వారానే ట్రాన్సాక్షన్లు నిర్వహించాల్సి ఉంటుంది. అప్పుడే ఆఫర్లు వర్తిస్తాయి.
8/ 8
ఇక పేటీఎంలో కూడా సిలిండర్ బుకింగ్‌పై ఆఫర్లు ఉన్నాయి. రూ.10 నుంచి రూ.1000 వరకు క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. దీనికి గ్యాస్1000 అనే ప్రోమో కోడ్ ఉపయోగించాలి. పీఎన్బీ క్రెడిట్ కార్డు ద్వారా సిలిండర్ బుక్ చేస్తే రూ. 30 క్యాష్‌బ్యాక్ వస్తుంది. ఇంకా ఫ్రీగ్యాస్ అనే ప్రోమో కోడ్ కూడా ఉపయోగించొచ్చు.