కమర్షియల్ గ్యాస్ సిలిండర్ తాజా ధరలను మెట్రో నగరాల్లో ఎలా ఉన్నాయో గమనిస్తే.. ఢిల్లీలో ఈ సిలిండర్ రేటు రూ. 2021గా ఉంది. కోల్కతాలో ఈ సిలిండర్ కొనాలంటే రూ. 2140 చెల్లించుకోవాలి. ముంబైలో అయితే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 1981 వద్ద ఉంది. చెన్నైలో ఈ సిలిండర్ రేటు రూ. 2186కు చేరింది. జూన్ నెలలో కూడా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గాయి. రూ. 135 మేర దిగి వచ్చింది.
అయితే, మే నెలలో మాత్రం డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధర రెండు సార్లు పెరిగింది. తొలిగా మే 7న సిలిండర్ ధర రూ. 50 పైకి చేరింది. అలాగే మే 29 సిలిండర్ రేటు మళ్లీ రూ. 4 మేర పెరిగింది. ఇలా రెండు సార్లు ధరలు పెరిగాయి. గత ఏడాది కాలంలో డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 834 నుంచి రూ. 1003కు చేరింది. చివరిగా మే 19న డొమెస్టిక్ సిలిండర్ ధర పెరిగింది.