LPG CYLINDER PRICE TODAY ONCE AGAIN SHOCK TO COMMON MAN OIL COMPANIES INCREASED GAS CYLINDER PRICE BY RS 25 SS
LPG Price Today: సామాన్యులకు మరో షాక్... భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర
LPG Cylinder Price Today | సామాన్యులకు మరో షాక్ తగిలింది. ఓవైపు పెట్రోల్ ధరలు పెరుగుతుంటే మరోవైపు గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది. ఎంత పెరిగిందో తెలుసుకోండి.
1. గ్యాస్ సిలిండర్ ధర మరోసారి పెరిగింది. లీటర్ పెట్రోల్ ధర రూ.100 దాటితే, గ్యాస్ సిలిండర్ ధర రూ.1,000 వైపు పరుగులు తీస్తోంది. ఈసారి గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా రూ.25.50 పెరిగింది. దీంతో హైదరాబాద్లో గ్యాస్ సిలిండర్ ధ రూ.887 కి చేరుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
2. ఆయిల్ కంపెనీలు ప్రతీ నెల మొదటి తేదీన గ్యాస్ సిలిండర్ల ధరల్ని సవరిస్తాయన్న సంగతి తెలిసిందే. ఒకటో తేదీన గ్యాస్ సిలిండర్ ధర పెరగొచ్చు లేదా తగ్గొచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో ఆయిల్ ధరలను బట్టి ఇది ఆధారపడి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
3. గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గడంకన్నా పెరగడమే ఎక్కువ. ఈసారి గ్యాస్ సిలిండర్ ధర రూ.25.50 పెరిగి సామాన్యులకు షాక్ ఇచ్చింది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
4. ఎల్పీజీ ధర రూ.25.50 పెరగడంతో ఢిల్లీలో ధర రూ.834.50 కి చేరుకుంది. ఇక కోల్కతాలో రూ.861, ముంబైలో రూ.834.5, చెన్నైలో రూ.850 ధరకు చేరుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
5. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ.25.50 పెరగగా, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.84 పెరిగింది. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
6. ప్రస్తుతం హైదరాబాద్లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1753 కాగా, ఢిల్లీలో రూ.1550. ఇక కోల్కతాలో రూ.1651.5 కాగా, ముంబైలో రూ.1507, చెన్నైలో రూ.1687.5. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 7
7. గత నెలలో ఎల్పీజీ డొమెస్టిక్ సిలిండర్ ధరల్ని పెంచలేదు ఆయిల్ కంపెనీలు. కమర్షియల్ సిలిండర్ ధర రూ.123 పెరిగింది. (ప్రతీకాత్మక చిత్రం)