ఏపీలో గమనిస్తే.. ఎల్పీజీ సిలిండర్ ధర ఇటీవలనే రూ. 50 మేర పెరిగింది. దీంతో ఈ రేటు రూ. 1161కు చేరింది. అలాగే డెలివరీ చార్జీలు కలుపుకుంటే సిలిండర్ ధర దాదాపు రూ. 1200కు చేరిందని చెప్పుకోవచ్చు. ఇది చాలా ఎక్కువ అనే చెప్పుకోవచ్చు. ఇక హైదరాబాద్లో గ్యాస్ సిలిండర్ ధరను గమనిస్తే.. రూ. 1155కు చేరింది. దీనికి కూడా డెలివరీ చార్జీలు కలుకుంటే.. రూ. 1190 వరకు చెల్లించుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.