LPG Cylinder: ఇండేన్ గ్యాస్ కస్టమర్లు ఎల్పీజీ బుక్ చేయాలంటే ఇకపై కొత్త నెంబర్‌కు కాల్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు వేర్వేరు ప్రాంతాలకు వేర్వేరు ఫోన్ నెంబర్లు ఉన్నాయి. దేశమంతా ఒకే నెంబర్ ఉండాలని భావించిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్... కొత్త నెంబర్‌ను ప్రకటించింది. ఇండేన్ గ్యాస్ కస్టమర్లు గ్యాస్ సిలిండర్ బుకింగ్ కోసం నవంబర్ 1 నుంచి 7718955555 నెంబర్‌కు కాల్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
LPG OTP: కస్టమర్లు ఎల్పీజీ సిలిండర్ పొందాలంటే ఇకపై ఓటీపీ చెప్పాల్సి ఉంటుంది. దీన్నే డెలివరీ ఆథెంటికేషన్ కోడ్ అంటారు. నవంబర్ 1 నుంచి అందరు ఎల్పీజీ కస్టమర్లకు ఇది వర్తిస్తుంది. డెలివరీ బాయ్‌కి ఓటీపీ చెప్తేనే సిలిండర్ డెలివరీ అవుతుంది. ఓటీపీ కస్టమర్ల రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వస్తుంది. అందుకే కస్టమర్లు తమ పేరు, అడ్రస్, మొబైల్ నెంబర్ లాంటి వివరాలను అప్డేట్ చేయించాలి. (ప్రతీకాత్మక చిత్రం)
Goa Casino: గోవా వెళ్లే పర్యాటకులకు శుభవార్త. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా గోవాలో క్యాసినో కార్యకలాపాలను మార్చిలో నిలిపివేసిన సంగతి తెలిసిందే. నవంబర్ 1 నుంచి గోవాలో క్యాసినోలను తెరుస్తారు. 50 శాతం కెపాసిటీని మాత్రమే అనుమతిస్తారు. క్యాసినోల్లో ప్రభుత్వం ప్రకటించిన అన్ని గైడ్‌లైన్స్ పాటించాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
Bank of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్లు డబ్బులు డిపాజిట్ చేయాలన్నా, విత్‌డ్రా చేయాలన్నా ఫీజు చెల్లించాలి. నవంబర్ 1 నుంచి ఈ రూల్ అమలులోకి వస్తుంది. ఇతర బ్యాంకులు కూడా ఇవే నిబంధనల్ని అమల్లోకి తీసుకొచ్చే అవకాశముంది. కొన్ని లావాదేవీలు ఉచితం. లిమిట్ దాటితే రూ.150 వరకు ఛార్జీలు చెల్లించాలి. (ప్రతీకాత్మక చిత్రం)