Top Credit Cards | మీరు కొత్తగా క్రెడిట్ కార్డు పొందాలని భావిస్తున్నారా? అయితే శుభవార్త. మార్కెట్లో చాలా రకాల క్రెడిట్ కార్డులు ఉన్నాయి. వీటిల్లో ఉచిత క్రెడిట్ కార్డులు కూడా లభిస్తున్నాయి. అందువల్ల మీరు క్రెడిట్ కార్డు కోసం అప్లై చేసుకోవాలని భావిస్తే.. ఈ ఉచిత క్రెడిట్ కార్డులను పరిశీలించొచ్చు.
అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు కూడా ఉంది. ఈ కార్డు కూడా ఫ్రీ. రూ. 300 నుంచి రూ. 600 వరకు వెల్కమ్ బోనస్ కింద అమెజాన్ పే బ్యాలెన్స్ లభిస్తుంది. ప్రైమ్ మెంబర్లకు అమెజాన్లో షాపింగ్ చేస్తే 5 శాతం క్యాష్ బ్యాక్ నాన్ ప్రైమ్ సభ్యులకు 2 శాతం క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇతర ఖర్చులపై 1 శాతం క్యాష్ బ్యాంక్ పొందొచ్చు.
హెచ్ఎస్బీసీ వీసా ప్లాటినం క్రెడిట్ కార్డు కూడా ఉంది. ఇది కూడా ఫ్రీ. ఈ కార్డు తీసుకుంటే రూ. 500 అమెజాన్ వోచర్ ఫ్రీగా వస్తుంది. 3 కాంప్లిమెంటరీ లాంజ్ యాక్సెస్ లేదా 3 మీల్ వోచర్స్ పొందొచ్చు. గూగుల్ పే ద్వారా చేసే తొలి ట్రాన్సాక్సన్పై 50 శాతం తగ్గింపు ఉంది. ప్రతి రూ.150 ఖర్చుపై 2 రివార్డు పాయింట్లు లభిస్తాయి.