పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), సుకన్య సమృద్ధి యోజన (ఎస్ఎస్వై), సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్, ఎన్ఎస్సీ, కేవీపీ వంటి పథకాలపై ఈ వారంలో వడ్డీ రేట్లు పెరిగే ఛాన్స్ ఉంది. ఆర్బీఐ రెపో రేటు పెంపు నేపథ్యంలో బ్యాంకులు వరుస పెట్టి ఎఫ్డీలపై వడ్డీ రేట్లు పెంచుకుంటూ వెళ్తున్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం కూడా స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌పై వడ్డీ రేట్లు పెంచొచ్చనే అంచనాలు నెలకొన్నాయి.
కేంద్ర ప్రభుత్వం సాధారణంగా త్రైమాసికం చొప్పున స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌పై వడ్డీ రేట్లను సమీక్షిస్తూ వస్తుంది. వడ్డీ రేట్లను పెంచొచ్చు. లేదంటే తగ్గించొచ్చు. ఇవి రెండూ కాకపోతే వడ్డీ రేట్లను స్థిరంగా కూడా కొనసాగించొచ్చు. జనవరి నుంచి మార్చి త్రైమాసికానికి సంబంధించి ప్రభుత్వం ఈ వారంలో ఒక నిర్ణయం తీసుకోనుంది.
ఫార్ములా ప్రకారం చూస్తే.. స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌పై వడ్డీ రేటు 44 నుంచి 77 బేసిస్ పాయింట్ల వరకు పెరగాల్సి ఉంది. పీపీఎఫ్ స్కీమ్2పై వడ్డీ రేటు 7.72 శాతంగా ఉండాలి. అయితే ఇప్పుడు ఈ రేటు 7.1 శాతంగా ఉంది. అలాగే ఏడాది టర్మ్ డిపాజిట్లపై అయితే వడ్డీ రేటు 5.5 శాతంగా ఉంది. అయితే ఇది ఫార్ములా ప్రకారం 6.09 శాతంగా ఉండాలి.