లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా అదానీ గ్రూప్‌లో పెట్టిన పెట్టుబడి దాని మొత్తం ఆస్తుల నిర్వహణలో (AUM) 0.975 శాతం మాత్రమేనని తెలియజేసింది. అదానీకి చెందిన అన్ని డెట్ సెక్యూరిటీలు 'AA' మరియు అంతకంటే ఎక్కువ రేటింగ్‌ను కలిగి ఉన్నాయని.. ఇది పెట్టుబడి కోసం బీమా నియంత్రణ సంస్థ IRDA నిర్దేశించిన షరతులకు అనుగుణంగా ఉంటుందని కంపెనీ నొక్కి చెప్పింది.