LIC: డబ్బులు లేక మీ ఎల్ఐసీ ప్రీమియం గడువులోగా కట్టలేదా? రూ.2,500 వరకు తగ్గింపు పొందొచ్చు
LIC: డబ్బులు లేక మీ ఎల్ఐసీ ప్రీమియం గడువులోగా కట్టలేదా? రూ.2,500 వరకు తగ్గింపు పొందొచ్చు
LIC Special Revival Campaign | చేతిలో డబ్బులు లేక మీ ఎల్ఐసీ పాలసీ ప్రీమియం చెల్లించలేదా? గడువు తేదీ దాటిపోయిందా? అయితే ఇప్పుడు మీ పాలసీ ప్రీమియం చెల్లించి రూ.2,500 వరకు తగ్గింపు పొందొచ్చు. ఎలాగో తెలుసుకోండి.
1. మీకు ఎల్ఐసీ పాలసీ ఉందా? ఆర్థిక ఇబ్బందుల కారణంగా పాలసీ ప్రీమియం చెల్లించలేకపోయారా? మీలాంటివారికి శుభవార్త చెప్పింది లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-LIC. స్పెషల్ రివైవల్ క్యాంపైన్ను ప్రారంభించింది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 8
2. అక్టోబర్ 9 వరకు స్పెషల్ రివైవల్ క్యాంపైన్ కొనసాగుతుంది. పలు కారణాల వల్ల ప్రీమియం చెల్లించనివారు, పాలసీలు ల్యాప్స్ అయినవారు తమ పాలసీలను రెన్యువల్ చేయించుకోవచ్చు. ప్రీమియం చెల్లించడం ఆపేస్తే రిస్క్ కవర్ ఆగిపోతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 8
3. అందుకే పాలసీహోల్డర్లు రిస్క్ కవర్ కొనసాగించుకోవడానికి వీలుగా తరచూ స్పెషల్ రివైవల్ క్యాంపైన్ను నిర్వహిస్తూ ఉంటుంది ఎల్ఐసీ. ఇప్పుడు మరోసారి ఈ క్యాంపైన్ ప్రారంభించింది. పాలసీ ల్యాప్స్ అయినట్టైతే అక్టోబర్ 9 వరకు రెన్యువల్ చేయించుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 8
4. పాలసీ ప్రీమియం చెల్లించడం ఆపేసిననాటి నుంచి ఐదేళ్లలలో పాలసీ రివైవ్ చేయొచ్చు. ఇది కూడా ఎంపిక చేసిన పాలసీలకు నియమనిబంధనలకు అనుగుణంగా రివైవల్ ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఎల్ఐసీ సూచించిన పాలసీలను మాత్రమే రెన్యువల్ చేసుకోవచ్చు. పాలసీహోల్డర్లు ప్రీమియంతో పాటు లేట్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎయితే ఎల్ఐసీ లేట్ ఫీజులో కన్సెషన్ ఇస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 8
7. ప్రీమియం రూ.1,00,000 లోపు ఉంటే లేట్ ఫీజులో 20% గరిష్టంగా రూ.1,500 వరకు తగ్గింపు లభిస్తుంది. రూ.1,00,001 నుంచి రూ.3,00,000 ప్రీమియం ఉంటే ఆలస్య రుసుములో 25% గరిష్టంగా రూ.2,000 వరకు, ప్రీమియం రూ.3,00,001 పైన ఉంటే లేట్ ఫీజులో 30% గరిష్టంగా రూ.2,500 వరకు తగ్గింపు పొందొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 8
8. ఒకవేళ మీరు మీ పాలసీని రివైవ్ చేయాలనుకుంటే దగ్గర్లోని ఎల్ఐసీ ఆఫీసులో సంప్రదించొచ్చు. మీ పాలసీని రెన్యువల్ చేయిస్తే గతంలో పాలసీపై ఉన్న బెనిఫిట్స్ ఎప్పట్లాగే పొందొచ్చు. రిస్క్ కవర్ కూడా కొనసాగుతుంది. బోనస్, ఇతర బకాయిలు క్రెడిట్ అవుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)