అంతేకాకుండా పాలసీ తీసుకున్న వారికి మధ్యలో 25 శాతం చొప్పున డబ్బులు చెల్లిస్తూ వస్తారు. 15 ఏళ్ల టెన్యూర్ ఎంపిక చేసుకుంటే వారికి 13వ సంవత్సరం, 14వ సంవత్సరం ఈ మనీ లభిస్తుంది. అదే 20 ఏళ్ల టెన్యూర్ ఎంచుకుంటే.. 18వ సంవత్సరం, 19వ సంవత్సరం డబ్బులు పొందొచ్చు. ఇక 25 ఏళ్ల టెన్యూర్ అయితే 23వ సంవత్సరం, 24వ సంవత్సరం డబ్బులు వస్తాయి.