దేశీయ భీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC)లో మనలో అనేక మంది పాలసీ కలిగి ఉంటారు. అయితే మనం పాలసీ చేసే సమయంలో సాధారణంగా నామినీ పేరు ఇవ్వాల్సి ఉంటుంది. జీవిత బీమా తీసుకునే వారికి నామినీ చాలా ముఖ్యం. బ్యాంక్ ఖాతా నుంచి జీవిత బీమా వరకు ప్రతీ దగ్గర మనం నామినీ పేరు నమోదు చేయాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
పాలసీదారుడు ప్రమాదవశాత్తు చనిపోతే అందుకు సంబంధించిన పాలసీ డబ్బును పొందగలిగే వ్యక్తి నామినీ. అయితే కొన్ని సందర్భాల్లో మెచ్యూరిటీ కంటే ముందు పాలసీదారుడు నామినీ పేరును మార్చే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే.. మనం నామినీ పేరు మార్చాలనుకుంటే ఏం చేయాలో తెలియక అనేక మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. (ప్రతీకాత్మక చిత్రం)
అయితే.. ఆన్లైన్లో నామినీ మార్చుకోవడానికి మాత్రం ఈ అవకాశం లేదు. మనం నామినీ మార్చుకోవాలనుకుంటే మాత్రం ఆఫ్ లైన్ లో మాత్రమే మార్చాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను అనుసరించడం ద్వారా మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా LIC నామినీని మార్చవచ్చు. మీరు మీ పాలసీ మెచ్యూరిటీకి ముందు ఎప్పుడైనా ఒక వ్యక్తిని లేదా ఒకరి కంటే ఎక్కువ మందిని నామినీగా చేర్చవచ్చు మరియు తీసివేయవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
నామినీని అప్డేట్ చేయడానికి పాలసీదారుడు ఈ స్టెప్స్ ఫాలో కావాల్సి ఉంటుంది. పాలసీదారులు ముందుగా ఎల్ఐసీ వెబ్‌సైట్‌ను సందర్శించాలి. అనంతరం అక్కడ ఉన్న LIC నామినీని మార్చడానికి మీరు నింపాల్సిన ఫారమ్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఫారమ్‌ను డౌన్లోడ్ చేసిన తర్వాత, మీ నామినీకి సంబంధించిన మొత్తం సమాచారాన్ని అందులో నింపాలి. (ప్రతీకాత్మక చిత్రం)
ఈ పామ్ పై మీరు సంతకం చేయాల్సి ఉంటుంది. అనంతరం ఈ ఫామ్ ను మీ ఎల్ఐసీ బ్రాంచ్ లో అందించాల్సి ఉంటుంది. అయితే, మీరు ఎవరిని నామినీగా చేస్తున్నారో వారితో మీకు ఉన్న సంబంధానికి సంబంధించిన రుజువు కూడా సమర్పించాల్సి ఉంటుంది. అయితే, మీరు మీ నామినీని మార్చడానికి మీరు కొంత రుసుమును (GSTతో పాటు) డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)