1. లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) అనేక పాలసీలను అందిస్తోంది. ఎల్ఐసీ నుంచి ఓ పెన్షన్ పథకం కూడా ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఓ పెన్షన్ పథకాన్ని ఎల్ఐసీ నిర్వహిస్తోంది. ఆ పథకం పేరు ప్రధాన మంత్రి వయ వందన యోజన (PMVVY). వృద్ధుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పథకం ఇది. రిటైర్ అయినవారికి ఎక్కువగా ఉపయోగపడే స్కీమ్ ఇది. (ప్రతీకాత్మక చిత్రం)
2. రిటైర్మెంట్ సమయంలో వచ్చిన డబ్బుల్ని ఒకేసారి ఇన్వెస్ట్ చేసి ప్రతీ నెలా పెన్షన్ పొందొచ్చు. ప్రస్తుతం ఈ స్కీమ్ ద్వారా 7.40 శాతం వడ్డీ లభిస్తోంది. 2022 ఏప్రిల్ 1న వడ్డీని సవరించే అవకాశం ఉంది. 2022 మార్చి 31 లోగా ఈ స్కీమ్‌లో చేరినట్టైతే 7.40 శాతం వడ్డీ పొందొచ్చు. ఈ లెక్కన రూ.9,250 వరకు పెన్షన్ పొందొచ్చు. ఎలాగో తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
3. కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి వయ వందన యోజన గడువును 2023 మార్చి 31 వరకు గడువు పొడిగించిన సంగతి తెలిసిందే. అప్పట్లోగా ఎప్పుడైనా ఈ స్కీమ్‌లో చేరొచ్చు. అయితే 2022 మార్చి 31 లోగా ఈ స్కీమ్‌లో చేరితే 7.40 శాతం వడ్డీ వర్తిస్తుంది. ఇది ఇమ్మీడియట్ పెన్షన్ ప్లాన్. అంటే ఈ పథకంలో చేరిన తర్వాతి నెల నుంచే పెన్షన్ పొందొచ్చు. పదేళ్ల పాటు పెన్షన్ తీసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)