1. మీరు ఎల్ఐసీ పాలసీ తీసుకోవాలనుకుంటున్నారా? ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే ప్రతీ నెలా అకౌంట్లోకి డబ్బులు వచ్చే పాలసీ ఎల్ఐసీలో ఉంది. లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-LIC గతేడాది 'న్యూ జీవన్ శాంతి' పాలసీని ప్రారంభించిన సంగతి తెలిసిందే. నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, ఇండివిజ్యువల్, సింగిల్ ప్రీమియం, డిఫర్డ్ యాన్యుటీ పాలసీ. (ప్రతీకాత్మక చిత్రం)
2. అంటే ఈ పాలసీ తీసుకుంటే ప్రతీ ఏటా ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. ఒక్కసారి ప్రీమియం చెల్లిస్తే ప్రతీ నెలా అకౌంట్లోకి డబ్బులు వస్తాయి. అందుకే సింగిల్ ప్రీమియం పాలసీ అన్నారు. ఎక్కువ మొత్తంలో డబ్బులు ఉన్నవారు, భవిష్యత్తులో ప్రతీ నెల కొంత ఆదాయం కోరుకునేవారు ఈ పాలసీ తీసుకోవచ్చు. మరి ఎల్ఐసీ 'న్యూ జీవన్ శాంతి' పాలసీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఈ పాలసీ తీసుకున్నప్పుడు వడ్డీ రేట్లు ఎంత ఉంటాయో మెచ్యూరిటీ వరకు అవే వడ్డీ రేట్లు వర్తిస్తాయి. ఈ పాలసీని ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు. లేదా ఎల్ఐసీ ఏజెంట్ దగ్గర తీసుకోవచ్చు. ఈ పాలసీలో సింగిల్ ప్రీమియం చెల్లించిన తర్వాత అవసరమైనప్పుడు లోన్ కూడా తీసుకోవచ్చు. లేదా పాలసీ సరెండర్ చేసి డబ్బులు వెనక్కి తీసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
9. అతను డిఫర్డ్ యాన్యుటీ ఫర్ సింగిల్ లైఫ్ పాలసీ ఎంచుకున్నట్టైతే ఏడాదికి రూ.99,400, ఆరు నెలలకు రూ.48,706, మూడు నెలలకు రూ.24,105, నెలకు రూ.7,952 డబ్బులు వస్తాయి. డిఫర్డ్ యాన్యుటీ ఫర్ జాయింట్ లైఫ్ ఎంచుకుంటే ఏడాదికి రూ.94,100, ఆరు నెలలకు రూ.46,109, మూడు నెలలకు రూ.22,819, నెలకు రూ.7,528 వస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)