LIC Endowment Plan | మీరు కొత్త ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలని భావిస్తున్నారా? ఇన్సూరెన్స్ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఎల్ఐసీనే. ఎల్ఐసీ అంతలా ప్రజల్లోకి వెళ్లిపోయింది. ఎల్ఐసీ కస్టమర్లకు ఎన్నో రకాల పాలసీలు అందిస్తోంది. పాలసీ ప్రాతిపదికన పాలసీదారులు పొందే ప్రయోజనాలు కూడా మారుతూ ఉంటాయి. అందుకే పాలసీ ఎంపికలో జాగ్రత్తగా ఉండాలి.
ఈ ఇన్సూరెన్స్ పాలసీ మెచ్యూరిటీ పీరియడ్ 12 ఏళ్ల నుంచి 35 ఏళ్ల వరకు ఉంటుంది. ఈ ప్లాన్ కొనుగోలు చేయాలని భావించే వారు నచ్చిన టెన్యూర్‌ను ఎంచుకోవచ్చు. ఇప్పుడే కెరీర్ ప్రారంభించిన వారు అయితే 35 ఏళ్ల వరకు టెన్యూర్ ఎంచుకోవచ్చు. అదే 40 ఏళ్లకు పైన వయసు కలిగిన వారు అయితే 12 ఏళ్ల టెన్యూర్ ఎంపిక చేసుకోవచ్చు.