ధన్ వర్ష పాలసీ తీసుకున్న వ్యక్తి పాలసీ టర్మ్‌లోనే మరణిస్తే.. అప్పుడు వారి కుటుంబానికి బీమా మొత్తం, గ్యారంటీడ్ అడిషన్స్ రెండింటినీ చెల్లిస్తారు. డెత్ క్లెయిమ్‌లో రెండు ఆప్షన్లు ఉంటాయి. బీమా మొత్తానికి 10 రెట్లు ఒక ఆప్షన్ అయితే బీమా మొత్తానికి 1.25 రెట్లు మరో ఆప్షన్. పాలసీదారుడు ఎంచుకున్న దాని ప్రకారం డబ్బులు చెల్లిస్తారు.
ఈ ప్లాన్ తీసుకోవడం వల్ల యాక్సడెంటల్ డెత్ అండ్ డిసెబిలిటీ బెనిఫిట్ రైడర్, టర్మ్ అస్యూరెన్స్ రైడర్, డెత్ బెనిఫిట్ ఇన్ ఇన్స్టాల్మెంట్స్, సెటిల్మెంట్ ఆప్షన్ ఫర్ మెచ్యూరిటీ, లోన్ (పాలసీ తీసుకున్న 3 నెలల తర్వాత పొందొచ్చు) వంటి ఇతర ప్రయోజనాలు కూడా పొందొచ్చు. రిటైర్మెంట్ ఫండ్, చిన్న పిల్లల ఇన్వెస్ట్మెంట్ వంటి వాటి కోసం ఈ పాలసీ తీసుకోవచ్చు.