1. మీరు లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) పాలసీ తీసుకోవాలని అనుకుంటున్నారా? ఎల్ఐసీ అన్ని వర్గాలకు కావాల్సిన పాలసీలను (LIC Policy) అందిస్తోంది. కస్టమర్లు తమ అవసరాలకు తగ్గట్టుగా పాలసీ ఎంచుకోవచ్చు. ఎల్ఐసీ అందిస్తున్న పాలసీల్లో జీవన్ లాభ్ పాలసీ (LIC Jeevan Labh Policy) ఒకటి. ఈ పాలసీతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఈ పాలసీలో రోజుకు రూ.252 చొప్పున చెల్లిస్తే చాలు మెచ్యూరిటీ నాటికి రూ.20 లక్షల వరకు పొందొచ్చు. ఈ పాలసీతో పన్ను లాభాలు కూడా ఉంటాయి. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద ట్యాక్స్ బెనిఫిట్స్ పొందొచ్చు. మీరు ట్యాక్స్ సేవింగ్ కోసం పాలసీ తీసుకోవాలనుకుంటే ఇది కూడా ఓ బెస్ట్ పాలసీ. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఎల్ఐసీ జీవన్ లాభ్ పాలసీలో కనీస సమ్ అష్యూర్డ్ రూ.2 లక్షలు. గరిష్ట పరిమితి లేదు. కనీసం 8 ఏళ్ల నుంచి 59 ఏళ్ల వయస్సు ఉన్నవారు ఈ పాలసీ తీసుకోవచ్చు. కనీస పాలసీ టర్మ్ 16 ఏళ్లు. ఒకవేళ 54 ఏళ్ల వ్యక్తి పాలసీ తీసుకుంటే 21 ఏళ్ల టర్మ్ ఎంచుకోవచ్చు. 50 ఏళ్ల వ్యక్తి పాలసీ తీసుకుంటే 25 ఏళ్ల టర్మ్ ఎంచుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
4. మెచ్యూరిటీ పీరియడ్ 16 నుంచి 25 ఏళ్ల మధ్య ఉంటుంది. ప్రీమియం 10 ఏళ్ల నుంచి 16 ఏళ్ల మధ్య చెల్లించాలి. పాలసీ హోల్డర్లు ప్రతీ నెల, మూడు నెలలకోసారి, ఆరు నెలలకోసారి, ఏడాదికోసారి ప్రీమియం చెల్లించొచ్చు. ఉదాహరణకు ఓ వ్యక్తి 25 ఏళ్ల టెన్యూర్‌తో పాలసీ తీసుకొని 16 ఏళ్ల పాటు రోజుకు రూ.252 చొప్పున చెల్లించాలి. (ప్రతీకాత్మక చిత్రం)
5. మెచ్యూరిటీ సమయంలో రూ.20,00,000 రిటర్న్స్ వస్తాయి. పాలసీహోల్డర్ పాలసీ కొనసాగుతున్న సమయంలో మరణిస్తే సమ్ అష్యూర్డ్ మొత్తాన్ని నామినీకి చెల్లిస్తారు. ఈ పాలసీ ప్రత్యేకత ఏంటంటే 16 ఏళ్లు ప్రీమియం చెల్లిస్తే 25 ఏళ్ల కవరేజీ లభిస్తుంది. భారీ మొత్తంలో సమ్ అష్యూర్డ్‌తో పాలసీ తీసుకోలేని వారు రూ.2,00,000 సమ్ అష్యూర్డ్‌తో ఈ పాలసీ తీసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)