ఎల్ఐసీ ఐపీవోను ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ ఫైనాన్షియల్ ఇయర్లోనే పూర్తి చేయాలని ప్రభుత్వం భావించినా ఉక్రెయిన్ రష్యా యుద్ధం కారణంగా ఐపీవో మరింత లేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎల్ఐసీ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (IPO) ఈ ఆర్థిక సంవత్సరం(2021-22)లో వచ్చే అవకాశం లేదని స్పష్టంగా తెలుస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో దేశీయ, అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లు కుదేలవుతూ వస్తున్నాయి. బీఎస్ఈ(BSE), ఎన్ఎస్ఈ(NSE)లు తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితి ఇంకా కొన్నాళ్లు కొనసాగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఈ నెలలో ఎల్ఐసీని ఐపీఓకు తెచ్చే ప్లాన్ను ప్రభుత్వం పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
ఫిబ్రవరి 13న ప్రభుత్వం ఐపీఓ(IPO) కోసం ముసాయిదా రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (DRHP)ని సెబీకి దాఖలు చేసింది. దీనికి సెబీ ఆమోదం కూడా తెలిపింది. ఈ ఐపీఓ ద్వారా దాదాపు 31.6 కోట్ల షేర్లను వాటాను విక్రయించాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీని ద్వారా ప్రభుత్వ ఖజానాకు దాదాపు రూ. 60 వేల కోట్లు వస్తాయని అంచనా. (ప్రతీకాత్మక చిత్రం)
ఎల్ఐసీ ఐపీఓ జరిగితే ఐపీఓగా వచ్చిన అతిపెద్ద పబ్లిక్ ఇష్యూగా ఎల్ఐసీ నిలువనుంది. అంతర్జాతీయ యాక్చురియల్ సంస్థ మిల్లిమాన్ అడ్వైజర్స్ రిపోర్ట్ ప్రకారం.. సెప్టెంబరు 30, 2021 నాటికి ఎల్ఐసీ లోని కన్సాలిడేటెడ్ షేర్హోల్డర్ల వాల్యూ సుమారు రూ.5.4 లక్షల కోట్ల వరకు ఉంది. ఇది ఎంబెడెడ్ వాల్యూ కంటే దాదాపు 3 రెట్లు ఎక్కువ ఉంటుంది.(ప్రతీకాత్మక చిత్రం)
ఇదిలా ఉంటే ఎల్ఐసీ ఐపీఓ (LIC IPO) పరిమాణంలో 35 శాతం వరకు రిటైల్ పెట్టుబడిదారుల కోసం రిజర్వ్ చేశారు. పాలసీదారులు లేదా ఎల్ఐసీ ఉద్యోగులకు ఇచ్చే డిస్కౌంట్ను కేంద్రం ఇంకా వెల్లడించలేదు. 2022 బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి పాత డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యమైన 1.75 లక్షల కోట్లను 78 వేల కోట్లకు తగ్గించారు. (ప్రతీకాత్మక చిత్రం)
ఇప్పటివరకు డిజిన్వెస్ట్మెంట్ ద్వారా రూ.13 వేల కోట్లు సమీకరించిన ప్రభుత్వం.. ఎల్ఐసీలో తన 5 శాతం వాటాను విక్రయించడం ద్వారా మరింత సేకరించనుందని సమాచారం. ప్రస్తుతం ఎల్ఐసీ ఐపీఓ కోసం సెబీ ఇచ్చిన అనుమతులు మే12వరకు అమల్లో ఉంటాయి. ఒకవేళ ఆ లోపు ఐపీఓకు రాకపోతే మళ్లీ ఐపీఓకి అనుమతి కోరుతూ సెబీకి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.(ప్రతీకాత్మక చిత్రం)