1. మీకు లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) పాలసీ ఉందా? ప్రతీ ఏటా ఎల్ఐసీ ప్రీమియం చెల్లిస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. త్వరలో ఎల్ఐసీ ఐపీఓ (LIC IPO) రాబోతోంది. ఇప్పటికే ఎల్ఐసీ డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (DRHP) ఫైల్ చేసింది. ఈ ఐపీఓ ద్వారా 5 శాతం వాటాలను అమ్మనుంది కేంద్ర ప్రభుత్వం. 31.6 కోట్ల షేర్లను ఐపీఓ ద్వారా మార్కెట్లోకి తీసుకురానుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఎల్ఐసీ ఐపీఓలో పాలసీదారులకు గుడ్ న్యూస్ ఏంటంటే... వారికి ఆఫర్ సైజ్‌లో 10 శాతం కోటా లభించనుంది. అంటే ఎల్ఐసీ పాలసీ ఉన్నవారు ఈ ఐపీఓకి పాలసీహోల్డర్ కోటాలో అప్లై చేయొచ్చు. వారికి ఇష్యూ ప్రైస్‌లో డిస్కౌంట్ కూడా లభించనుంది. డిస్కౌంట్ ఎంత అన్నది తెలియాల్సి ఉంది. మరోవైపు ఎంప్లాయీ కోటా 5 శాతం ఉండనుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఎల్ఐసీ పాలసీహోల్డర్ కోటా, ఎంప్లాయీ కోటాతో పాటు రీటైల్ కోటా, హెచ్ఎన్ఐ కోటా, క్యూఐబీ కోటాలు ఉంటాయి. పాలసీ హోల్డర్ కోటాలో గరిష్టంగా రూ.2 లక్షల వరకు బిడ్ దాఖలు చేయొచ్చు. ఎల్ఐసీ పాలసీ ఉన్నవారు రీటైల్ కోటాతో పాటు పాలసీహోల్డర్ కోటాలో కూడా అప్లై చేయొచ్చు. ఎల్ఐసీ పాలసీదారులు ఐపీఓకి పాలసీహోల్డర్ కోటాలో అప్లై చేయాలంటే తప్పనిసరిగా తమ పాన్ కార్డును పాలసీకి లింక్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఎల్ఐసీ పాలసీహోల్డర్లు 2022 ఫిబ్రవరి 28 లోగా తమ పాన్ కార్డ్ వివరాలను అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఈ వివరాలు అప్డేట్ చేసినవారు మాత్రమే పాలసీహోల్డర్ కోటాలో దరఖాస్తు చేయడానికి అర్హులు. పాలసీహోల్డర్లకు డీమ్యాట్ అకౌంట్ కూడా ఉండాలి. డీమ్యాట్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలో ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి. మరి పాలసీకి పాన్ నెంబర్ ఎలా లింక్ చేయాలో తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఎల్ఐసీ పాలసీకి పాన్ నెంబర్ లింక్ చేయడానికి ఎల్ఐసీ పాలసీ హోల్డర్లు ముందుగా https://licindia.in/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. హోమ్ పేజీలో Online PAN Registration పైన క్లిక్ చేయాలి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత Proceed పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత పుట్టిన తేదీ ఎంటర్ చేయాలి. జెండర్ సెలెక్ట్ చేయాలి. ఇమెయిల్ ఐడీ ఎంటర్ చేయాలి. (image: LIC Website)
6. మీ పాన్ నెంబర్ ఎంటర్ చేయాలి. పాన్ కార్డుపై ఉన్నట్టుగా పూర్తి పేరును ఎంటర్ చేయాలి. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. మీ పాలసీ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి Get OTP పైన క్లిక్ చేయాలి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. వివరాలన్నీ సరిచూసుకొని ఓటీపీ ఎంటర్ చేయాలి. మీ ఎల్ఐసీ పాలసీకి పాన్ నెంబర్ లింక్ అయిన తర్వాత కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఎల్ఐసీ పాలసీకి పాన్ నెంబర్ లింక్ అయిందో లేదో స్టేటస్ తెలుసుకోవడానికి ఎల్ఐసీ పాలసీ హోల్డర్లు ముందుగా https://licindia.in/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. హోమ్ పేజీలో Online PAN Registration పైన క్లిక్ చేయాలి. లేదా నేరుగా ఇక్కడ క్లిక్ చేయండి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
CHECK POLICY PAN STATUS పైన క్లిక్ చేయాలి. పాలసీ నెంబర్, పుట్టిన తేదీ, పాన్ నెంబర్ ఎంటర్ చేయాలి. క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి Submit పైన క్లిక్ చేస్తే స్టేటస్ తెలుస్తుంది. (image: LIC Website)