1. లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) సంస్థకు చెందిన హోమ్ లోన్ సంస్థ అయిన ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (LIC Housing Finance Ltd) విలేజ్ లెవెల్ ఆంట్రప్రెన్యూర్ల ద్వారా హోమ్ లోన్ ఇవ్వనుంది. తక్కువ వడ్డీకే హోమ్ లోన్ అందించేందుకు కామన్ సర్వీస్ సెంటర్స్‌తో (CSC) ఒప్పందం కుదుర్చుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. దేశవ్యాప్తంగా కామన్ సర్వీస్ సెంటర్స్ ద్వారా నాలుగు లక్షలకు పైగా విలేజ్ లెవెల్ ఆంట్రప్రెన్యూర్లు సేవలు అందిస్తున్నారు. అతిపెద్ద నెట్‌వర్క్‌లో ఉన్న వీరిని ఉపయోగించుకొని కస్టమర్లకు హోమ్ లోన్ ఆఫర్ చేయాలని ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్ నిర్ణయించింది. కేవలం 6.70 శాతం వడ్డీ నుంచి హోమ్ లోన్స్ అందిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. కామన్ సర్వీస్ సెంటర్స్‌తో కుదుర్చుకున్న ఒప్పందం ద్వారా ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్ అందించే లోన్ ప్రొడక్ట్స్‌కు విలేజ్ లెవెల్ ఆంట్రప్రెన్యూర్లు మధ్యవర్తులుగా వ్యవహరిస్తారు. వారు ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్ అందించే హోమ్ లోన్, లోన్ అగైన్స్ట్ ప్రాపర్టీ, టాప్ అప్ లోన్స్ అందిస్తారు. ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసేవారు, స్వయం ఉపాధి పొందుతున్నవారు ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్ అందించే ఈ రుణాలు పొందొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
4. కస్టమర్లు ఈ లోన్ ఆఫర్ పొందడానికి దగ్గర్లో ఉన్న కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లాలి. అక్కడ పాన్ కార్డ్, ఆదార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్, అడ్రస్ ప్రూఫ్, ఇన్కమ్ ప్రూఫ్ లాంటి కేవైసీ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి దరఖాస్తు ఫామ్ పూర్తి చేయాలి. ఈ దరఖాస్తుల్ని విలేజ్ లెవెల్ ఆంట్రప్రెన్యూర్లు ఈ దరఖాస్తుల్ని ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్‌కు పంపిస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)
6. విలేజ్ లెవెల్ ఆంట్రప్రెన్యూర్ల ద్వారా తమ లోన్ ప్రొడక్ట్స్‌ని మారుమూల ప్రాంతాలకు కూడా తీసుకెళ్లాలని ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్ భావిస్తోంది. రూరల్, సెమీ అర్బన్, అర్బన్ ప్రాంతాల్లో ఉన్న కామన్ సర్వీస్ సెంటర్లు ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్ అందించే రుణాలకు డెలివరీ పాయింట్లుగా మారుతున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
7. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కామన్ సర్వీస్ సెంటర్లను ఏర్పాటు చేసింది. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల వరకు ప్రభుత్వ పథకాలను అందించడం కోసం సామాన్యులకు కామన్ సర్వీస్ సెంటర్లు అందుబాటులో ఉంటాయి. ప్రజా వినియోగ సేవలు, సామాజిక సంక్షేమ పథకాలు, ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక, విద్య, వ్యవసాయ సేవలు పొందొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)