ఎల్ఐసీ ప్రకారం చూస్తే.. సవరించిన పాలసీకి సంబంధించిన పెంచిన యాన్యుటీ రేట్లు జనవరి 5 నుంచి కొనుగోలు చేసి పాలసీలకు ఇది వర్తిస్తుంది. అలాగే అధిక కొనుగోలు ధరకు సంబంధించి ప్రోత్సాహం కూడా పెంచినట్లు ఎల్ఐసీ తెలిపింది. ఇది రూ.3 నుంచి రూ.9.75 వరకు ఉంటుందని, రూ.1000 పర్చేజ్ ప్రైస్కు ఇది వర్తిస్తుందని తెలిపింది. కొనుగోలు ధర, డిఫ్మెంట్ పీరియడ్ ఆధారంగా ఈ రేట్లు మారతాయని పేర్కొంది.
సింగిల్ లైఫ్ డిఫర్డ్ యాన్యుటీ ప్లాన్, జాయింట్ లైఫ్ డిఫర్డ్ యాన్యుటీ అనే రెండు ఆప్షన్లు ఉంటాయి. వీటిల్లో ఒకదాన్ని ఎంచుకోవచ్చు. ఒక్కసారి ఒక్కదాన్ని సెలెక్ట్ చేసుకుంటే తర్వాత మార్చుకోవడం ఉండదు. నెలకు రూ.1000 నుంచి కనీస యాన్యుటీ లభిస్తుంది. ఏడాదికి రూ. 12 వేలు, ఆరు నెలలకు రూ. 6 వేలు, మూడు నెలలకు రూ. 3 వేలు పొందొచ్చు.
ఉదాహరణకు రూ.10 లక్షలు పెట్టి పాలసీ కొనుగోలు చేస్తే.. మీకు నెలకు రూ. 11,190 వరకు నెలవారీ పెన్షన్ లభిస్తుంది. డిఫర్డ్ యాన్యుటీ ఫర్ సింగిల్ లైఫ్ ఆప్షన్ ఎంచుకున్న వారికి ఇది వర్తిస్తుంది. అదే డిఫర్డ్ యాన్యుటీ ప్లాన్ ఆఫ్ జాయింట్ లైఫ్ ఆప్షన్ అయితే రూ. 10,570 పెన్షన్ రావొచ్చు. కాగా కనీసం రూ.1.5 లక్షలకు పాలసీ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. గరిష్ట పరిమితి ఏమీ లేదు.